Header Top logo

Guppedenta Manasu serial గుప్పెడెంత మనసు సీరియల్

Guppedenta Manasu serial

‘గుప్పెడెంత మనసు’ సీరియల్ ముచ్చట్లు

YATAKARLA MALLESH

హైదరాబాద్ నగరం పేట్ బషీరాబాద్ ప్రాంతం.. 12 నవంబర్ 2021న మధ్యాహ్నం రెండు గంటలు.. ఇంటి నుంచి కారులో ఫ్యామిలీతో వెళుతున్న నాకు గెస్ట్ హౌజ్ ముందు కనిపించే హడావుడి చూసి ఆపాను. గేట్ లోపల రెండు కెమెరాలతో వేరు వేరుగా షూటింగ్ చేస్తున్న సీన్ కనిపించింది.  ఒక్కరిద్దరు కాదు అక్కడ ముప్పయి మంది సిబ్బంది ఉన్నారు. మా అర్ధాంగి లలిత, బిడ్డ మల్లికతో లోనికి వెళ్లాం. ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ తీస్తూ నటి నటులు బిజీ బిజీగా కనిపించారు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

డిస్నీ హట్ స్టార్ లో..

ప్రతి రోజు పొద్దున్నే డిస్నీ హట్ స్టార్ లో నాకు ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ చూసే అలవాటుంది. అగో.. మీరేంది గా సీరియల్ చూసుడేంది అని అడుగచ్చు. ఎమో.. ఎందుకో నేనైతే తప్పకుండా ఈ ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ చూస్తా. ఇక్కడ మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. ఆ సీరియల్ చూస్తున్నప్పుడు మా ఆవిడ నాతో విగ్వివాదానికి దిగుతుంది. ‘‘రుషిలా నీవు ఇంట్లో తిక్క తిక్కగా వ్యవహరిస్తావ్.’’ అని మా ఆవిడ దెప్పి పొడుస్తాది.

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

తల్లి జగతి- తండ్రి మహేందర్ ఓ కొడుకు రిషి ప్రేమ మధ్య కొనసాగుతున్న ఈ ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ లో వసుధరతో ప్రేమ వ్యవహరం సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో ముందుకు తీసుకెళ్లుతున్న రచయిత గారిని చూడాలనిపించింది. కానీ.. ఆ షూటింగ్ లోకేషన్ లో ఆ రచయితలు ఉండరట. దేవయాని-ధరణి అత్తకొడుళ్ల డైలాగులు ఆలోచింప చేస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవయాని విలన్ పాత్రంలో జీవిస్తుంటారు. Guppedenta Manasu serial

లోకేషన్ ముచ్చట్లు..

ఆ గెస్ట్ హౌజ్ లోకి వెళ్లగానే దూరంలో జగతి గారు మేకాప్ వేసుకుంటున్నారు. అసిస్టెంట్ అద్దం పట్టుకుని నిలబడితే తానే మొఖంపై మేకప్ వేసుకుంటూ కనిపించారు. ఆమె దగ్గరకు వెళ్లి సెల్ ఫోన్ తో క్లిక్ మని ఫోటోలు తీసాను. కో-డైరెక్టర్ గోవింద్ గారు సీరియల్స్ ఎలా తీయాలో సిబ్బందికి సలహాలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అక్కడే వసుధర డైలాగ్ చెబుతుంటే కెమెరాతో షూట్ చేస్తున్నారు కెమెరామెన్. ఆ సీన్స్ ను సెల్ తో తీస్తుంటే అభ్యంతరం చెప్పారు అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడే మహేందర్ గారు గేట్ లోపలికి వచ్చి గార్డెన్ లో కూర్చుని సెల్ ఫోన్ లో బిజీ అయ్యారు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

సీరియల్ లో పాత్రలాగే..

‘గుప్పెడెంత మనసు’ సీరియల్ లో కన్న కొడుకు రుషి అంటే ఎంత ప్రేమగా ఉంటాడో.. అగో అలాగే మా ఫ్యామిలీని రిసివ్ చేసుకున్నారు మహేందర్ భూషన్ గారు. మా ఆవిడ లలితైతే ఆ సీరియల్ ను చూస్తూ నేను ఎలా వ్యవహరిస్తానో ఆ మహేంద్ర గారికి చెబుతుంటే అతను నవ్వుతున్నాడు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

జర్నలిస్ట్ గా ముచ్చట..

నేను జర్నలిస్ట్ గా మహేంద్ర గారిని పరిచయం చేసుకున్నాను. ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ గురించి ముచ్చటించాను. ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ ప్రస్తుతం టీవీలలో వస్తున్న వాటికి భిన్నమైన కథ ఉండటమే అన్నారు మహేంద్ర గారు. తల్లి-కొడుకుల మధ్య మనస్పర్థాలు వస్తే ఎలా ఫీలావుతారో చూపిస్తునే మిస్ అండర్ స్టాండింగ్ తో సమస్యలు ఎలా ఏర్పాడుతాయో ఈ సీరియల్ మంచి సందేశం ఇస్తుందన్నారు ఆయన. శిరిష్ పెళ్లి వ్యవహరంలో సస్పెన్స్ కొనసాగించడంపై మహేంద్ర గారు మాట్లాడారు. రుషి-వసుంధరల మధ్య శిరిష పెళ్లి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరింతా థ్రిల్లింగ్ గా ఉంటుందని వివరించారు అతను. Guppedenta Manasu serial

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

జగతి గారితో..

షూటింగ్ కు దూరంగా కుర్చిలో కూర్చుండి టీ తాగుతున్న జగతి గారు కనిపించారు. మా ఆవిడ లలితతో ఆమె వద్దకు వెళ్లగానే కుర్చిలోంచి లేసి మర్యాదగా మాట్లాడారు. జగతి గారితో మాట్లాడుతుంటే ఫ్యామిలీ మెంబర్ లా అనిపించింది. ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు నా సందేహాలకు సమాధానం ఇచ్చారు. సినీమాలకు, సీరియల్స్ కు గల తేడాను ఆమె వివరించారు. ఇష్టం లేని సన్ని వేషాలు సీరియల్ లో ఉంటే మనం ఫ్రెండ్లిగా సలహాలు ఇస్తే తీసుకుంటరన్నారు జగతి గారు. తెలుగు ప్రజలు ‘గుప్పెడెంత మనసు’ సీరియల్ ను ఆధరిస్తున్న తీరు చూస్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.

సస్పెన్స్, థ్రిల్లింగ్ డైలాగ్ లతో

రుషి-వసుధరతో..

షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న రుషి-వసుధరలు బిజీ బిజీగా ఉన్నారు. ఇన్నోవా వెహికిల్ లో ఇద్దరూ వెళుతున్న సీన్ ను కెమెరామెన్ షూట్ చేస్తున్నారు. అయినా.. టైమ్ తీసుకుని వారితో ఫోటోలు దిగి వచ్చాం. లోకేషన్ లో కనిపించే సిబ్బందిని చూసి ఆశ్చర్య పోయాను. సీరియల్ తీయడానికి ముప్పయి మంది సిబ్బంది ఉన్నారు. పొద్దంతా వాళ్లు సీరియల్ తీస్తే మనం ఇరువై నిముషాలు చూసి జడ్జిమెంట్ ఇస్తాం కదా అనుకున్నాను. ఈ “గుప్పెడంత మనసు” సీరియల్ నిర్మాణ సంస్థ- భూమి ఎంటర్ టైన్ మెంట్, నిర్మాత- అనిల్ ఆనంద్, దర్శకుడు-అనిల్ ఆనంద్, కుమార్ పంతం, సహ నిర్మాత-శ్రీనివాస్ మాదిరెడ్డి, కథనం-ఉషారాణి, మాటలు-ఆది గణేష్, ఎడిటింగ్-సురేష్ కె. కసుకుర్తి, రీరికార్డింగ్-రమేష్ సింగణమోని, డి.వో.పి-లక్ష్మీ శ్రీనివాస్, కో డైరెక్టర్- గోవింద్.

YATAKARLA MALLESH

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

949 222 5111

Leave A Reply

Your email address will not be published.

Breaking