Guinness World Record holder యువతకు ఆధర్శం గట్టెం వెంకటేశ్
గిన్నిస్ బుక్ రికార్డు
Guinness World Record holder Venkatesh
యువతకు ఆధర్శం గట్టెం వెంకటేశ్ జీవితం
అతను అందరిలా ఆలోచించలేదు. బడికెళ్లి అక్షరాలతో పాటు కళపై దృష్టి పెట్టాడు. ఊహా తెలయడంతోనే తాను ఏదో సాధించలనుకున్నాడు. కనిపించిన ప్రతి వస్తువును కళాత్మకంగా చూశాడు. దానికి రూపం ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యున్నతమైన గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు గట్టెం వెంకటేశ్. ఇప్పుడు అతను యూత్ కు ఐకాన్ ను కనిపిస్తున్నాడు.
వెంకటేశ్ జీవితం
గట్టెం వెంకటేశ్ ది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు. సూరిబాబు, సత్యవతి దంపతులకు 28 మే 1996 న జన్మించారు. అతని తండ్రి రైతు. తల్లి గృహిణి. ప్రాథమిక విద్యాభ్యాసం గౌతం మాడల్ స్కూలులో గడిచింది. 2019లో విశాఖలో గీతం విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో పట్టా పుచ్చుకున్నారు.
సూక్ష్మకళపై ఆసక్తి
చిన్నతనంలోనే సూక్ష్మకళపై ఆసక్తి పెంచుకున్న వెంకటేష్ పెన్సిల్ ముల్లు, చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల ఇలా కంటికి కనిపించిన ప్రతి వస్తువుతో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఏకంగా 400కి పైగా కళాకృతులను రూపొందించి 100కు పైగా అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. వీటిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు కూడా ఉన్నాయి.
ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కోసం
వెంకటేశ్ న్యూయార్క్ నగరంలో ఉన్న ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ని పంటిపుల్ల(టూత్ పిక్)పై చెక్కాలని నిర్ణయించుకుని 6 ఏళ్ల పాటు కష్టపడి ఎట్టకేలకు దాన్ని మలిచారు. 18 మిల్లీమీటర్ల పొడవైన అత్యంత సూక్ష్మమైన ఆకృతిలో ‘ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’ను పంటిపుల్లపై చెక్కారు. ఈ సూక్ష్మఆకృతి వెంకటేష్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులొనికి ఎక్కించింది. 19 ఏళ్లవయసుకే ఇతడు ఈ రికార్డ్ సృష్టించడం విశేషం.
కళ ప్రజల కోసం
కళ కళ కోసం కాదు ప్రజల కోసం కళ అనుకున్నాడు వెంకటేశ్.. కళను నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వారికి నేర్పడానికి వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు అతను. ముఖ్యంగా విద్యార్థులలో దాగిన కళ ప్రతిభను వెలికి తీయడానికి కృషి చేస్తున్నాడు. వెంకటేశ్ ఆధ్యర్యంలో ఇప్పటి వరకు 80 పాఠశాలలో 15000 విద్యార్థులకు సూక్ష్మకళలో శిక్షణ ఇచ్చారు. వ్యర్థపదార్థాలనుండి అలంకరణ వస్తువులను తయారు చేయడం కూడా నేర్పిస్తుంటారు.
వృధగా ఏది కనిపించిన
సూక్ష్మ కళాకారుడైన వెంకటేశ్ కు వృధగా ఏది కనిపించిన అది ఆర్ట్ గా అవతాతరమెత్తుతాది. పెన్సిల్ ముల్లు, చిత్తుకాగితం, ఐస్ క్రీమ్ పుల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల, పంటిపుల్ల వంటి సూక్ష్మవస్తువులపై కళాఖండాలను, పేర్లను చెక్కాడు.
పురస్కారాలు
2016లో స్కోర్‌మోర్ ఫౌండేషన్ వారిచే ప్రతిభా శిరోమణి పురస్కారం .
2016లో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డు – 48 గంటలలో ఖాళీ దారపు రీళ్ళతో 90 సెం.మీ.ల ఈఫిల్ టవర్ ప్రతిమను తయారు చేసినందుకు .
2017లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు – పంటిపుల్లపై 18 మి.మీ.ల పరిమాణంలో న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నకలును చెక్కినందుకు.
2018లో భారతజాతీయ యువపురస్కార గ్రహీతల ఫెడరేషన్‌చే రాష్ట్రీయగౌరవ్ సమ్మాన్
2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంచే ఉగాది పురస్కారం
జర్మనీలోని ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవడాక్టరేట్
2019లో భారతప్రభుత్వం యువజనవ్యవహారాలు క్రీడలమంత్రిత్వశాఖచే జాతీయయువ పురస్కారం.
వరల్డ్ రికార్డ్స్ ఇండియా – అగ్గిపుల్లపై సూక్ష్మశిల్పాన్ని చెక్కినందుకు.
యూనిక్ వరల్డ్ రికార్డ్ – కాగితపు పడవలతో అతిపెద్ద మొజాయిక్ చేసినందుకు..
ప్రముఖుల మన్ననలు
కళఖండ అంటే ఎవరికైన ఇష్టమే.. సూక్ష్మ కళాకారుడైన వెంకటేశ్ చేతిలో రూపు దిద్దుకున్న సూక్ష్మ బొమ్మలను చూసి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ హీరో పవాన్ కళ్యాణ్ ముగ్దులయ్యారు. వెంకటేశ్ ను వారు అభినందించారు.