ఏపీ 39 టీవీ,
మే 26,
D.హీరేహాల్ :-అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలూకా, D.హీరేహాల్ మండలం పరిధిలోని సోమలాపురం గ్రామంలో సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల తో సమావేశం ఏర్పరచి గ్రామంలో కోవిడ్ నియంత్రణకు చేపట్టవలసిన పారిశుద్ధ్య కార్యక్రమాలు మరియు ప్రజలలో కోవిడ్ నివారణకు పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు కల్పించాల్సిన అవగాహన పై సచివాలయ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అలాగే sc కాలనీ ప్రజలు తమ కాలనీలో విద్యుత్ వోల్టేజిలో హెచ్చు తగ్గులతో తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారి దృష్టికి తెచ్చారు, సమస్య విన్న వెంటనే విద్యుత్ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి గారు మరియు వై ఎస్ ఆర్ సి పి, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.