Full moon poetry నిండు పౌర్ణమి (కవిత్వం)
Full moon poetry
నిండు పౌర్ణమి (కవిత్వం)
చిక్కని చీకటి నును వెచ్చని పొలిమేరలు దాటాక
మరులు గొలుపనో, మరిమైమరుపును కలిగించనో
పెదవి విరుపు సవరించనో మగువ మనసు కరిగించనో
సొగసు వయ్యారాలు ఒలకబోసుకుంటూ
పృకృతి కాంత సంబురపడగా వగలాడి వెన్నెల కులుకుతూ వచ్చింది.
నాగేటి సాలులా నవ్వులు రువ్వుతూ..
గాలితో సయ్యాటలాడాలనుందో నీటి అలలతో నాట్యమాడాలనుందో
ఆకాశంతో పాట పాడాలనుందో పరువపు సొగసులతో జలకాలు ఆడాలనుందో
ధూళి రేణువుల్లోను ధగధగలు ముఱియంగదూదిపింజలాగ మనసు తేలి,
తేలియాడంగ తళుకు బెళుకులతో కులుకుతూ వచ్చింది.
మరుమల్లెల గుభాళింపుతో గూడి మధుర జ్ఞాపకమై Full moon poetry
మబ్బు తునకలన్ని మదిని గుచ్చుకొనగ
సముద్రమంత గాయాలను మోస్తూస్వాగతం పలుకుతోంది.
వెన్నెల నిండు మనసులకు సరితూగు పూర్ణబింబమై..
మచ్చరాజమౌళి, దుబ్బాక
9059637442