Header Top logo

From hanging As a journalist -02 రాజన్న ఆత్మకథ

రియల్ హీరో రాజన్న ఆత్మకథ

ఉరి నుంచి

జర్నలిస్ట్ గా జర్నీ…

 

ధారావాహిక-02

 

కోర్టు బోన్ లో రాజన్న చేతులు వెనక్కి పెట్టీ బేడీలు వేసి ఉన్నాయి. వాదోపవాదాలు ముగిసినందున ఈరోజు జడ్జీ రాజన్న కేసులో తీర్పు చెప్పనున్నారు. తీర్పు విని రాజన్న నిన్నటిలా చెప్పుతో మళ్లీ తనపై దాడి చేయొచ్చని భావించిన జడ్జీ ముందు జాగ్రత్తగా బేడీలు వేయించారు.

ఆ కోర్టు హాల్ లో ఉన్న వారంతా ఏమి జరుగుతుందోనని ఎదురు చూస్తున్నారు.

 

రాజన్న మాత్రం అవేమీ పట్టించు కాకుండా జడ్జీ మొఖం చూడకుండా నేల కేసి చూస్తున్నాడు.

 

“రాజన్న.. నెలకు ఎందుకు చూస్తున్నావ్. నా వైపు చూడు. చివరగా కోర్టుకు ఏదైనా చెప్పుకోవాల్సింది ఉందా..” అదిగాడు జడ్జీ.

 

“ఈ కోర్టులు బూటకం. నాలాంటి పేదోడి కి న్యాయం జరుగదు. పోలీసులు, డాక్టర్ అందరూ దొంగ సాక్షాలు సృష్టించారు. నేను చెప్పింది మీరు వినిపించు కోవడం లేదు. దొర నామీద దాడి చేస్తే ఆత్మ రక్షణ కోసం హత్య చేశాను. అయినా మీరేమో వ్యూహం ప్రకారం హత్య చేశారని దొంగ సాక్షాలు.. అందుకే ఈ కోర్టును బహిష్కరిస్తున్నా.” జడ్జీని చూడకుండానే సమాధానం ఇచ్చాడు రాజన్న.

 

జడ్జీ తన ముందు ఉన్న కాగితాలను మరోసారి చూసి తీర్పు చెప్పడానికి సిద్దం అయ్యారు.

” కే. రాజన్న తండ్రి నానాజీ గ్రామం కాప్రి జిల్లా ఆదిలాబాద్ అను వ్యక్తిపై హత్యరోపనలు నిజమని కోర్టు నమ్ముతుంది. దొరను వ్యూహం ప్రకారం కత్తితో అతి దారుణంగా పొడిచి హత్య చేసినట్లు సాక్షదారలు ఉన్నాయి. అతను ప్రమాదకరమైన స్వభావం గల వ్యక్తి. అతని వల్ల ఈ సమాజ మనుగడ సురక్షితం కాదు. కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం రాజన్న మరణించే వరకు ఉరి తీయాలి.” తీర్పు చెప్పిన జడ్జీ తాను తీర్పు రాసిన పెన్నును అక్కడే విరిసి వేశాడు.

 

ఆ తీర్పు విన్న రాజన్నలో పెద్దగా ఫీలింగ్స్ కనిపించలేదు. దొంగ సాక్ష్యాలతో కోర్టులో వాదోపవాదాలు కొన సాగినందిన తనకు శిక్ష తప్పదని ముందుగానే మానసికంగా సిద్ధం అయ్యాడు.

 

తీర్పు చెప్పిన జడ్జీ కోర్టు నుంచి తన ఛాంబర్ లోకి వెళ్ళాడు.

 

“రాజన్న జడ్జీ పైకి చెప్పు విసరడం వల్లనే ఉరి శిక్ష ఖరారు చేశాడు. దొరను హత్య చేసినందుకు యావజ్జీవ కారగార శిక్ష వేస్తారు అనుకున్నాను.”

కోర్టు హాల్ లోనే లాయర్లు మాట్లాడుకుంటున్నారు.

 

కోర్టు బోన్ లోనుంచి రాజన్నను పోలీసులు తీసుకుని వ్యాన్ వద్దకు వచ్చారు.

 

“ఆగో గా పిల్లవాడికి ఉరి శిక్ష పడిందట.. గింత చిన్న వయసులో గంత పెద్ద శిక్షణా..  దొర చేసిన ఆరాచకలకు హత్య చేసి మంచి పని చేశాడు. కానీ.. ” ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు కోర్టుకు వచ్చిన రాజన్న ఊరు ప్రజలు.

 

రాజన్న ను వ్యాన్ లో తీసుకెళ్లారు పోలీసులు. ఆ వ్యాన్ వెళుతున్న వైపు చూస్తున్నారు కాప్రి గ్రామ ప్రజలు.

 

( మూడవ ఎఫిషోడ్ లో కలుద్దాం)

mallesh yatakarla

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

9492225111

Leave A Reply

Your email address will not be published.

Breaking