AP 39TV 01మే 2021:
రాయదుర్గం పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యతగా పోరాడాలి అంటూ సిపిఎం డివిజన్ కార్యదర్శి డి మల్లికార్జున కార్మిక వర్గానికి పిలుపు ఇచ్చారు. ప్రపంచ కార్మికుల దినోత్సవం135 వ మే డే ను పురస్కరించుకుని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నందు కార్మికుల హక్కుల పోరాట వేగుచుక్క అయినా ఎర్రజెండా ను చేనేత కార్మిక సంఘం నాయకులు మధు ఆవిష్కరించి కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బి మల్లికార్జున మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ, కార్మికుల శ్రమను కార్పొరేట్లకు దాసోహం చేస్తూ కొత్త కార్మిక చట్టాలను తీసుకొస్తుందని మండిపడ్డారు, దేశంలో కార్మికవర్గం ప్రాణాలను అర్పించిన సాధించుకున్నఎనిమిది గంటల పని ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల అన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కి అప్ప చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటాలు నిర్వహిస్తున్న ఏమాత్రం పట్టించుకోకుండా కార్పొరేట్ల కోసం ఊడిగం చేస్తూ కార్మికులను బానిసలుగా మారుతోందని మండిపడ్డారు. కనుక మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు యావత్ దేశ కార్మికవర్గం రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాల్సి ఉందని, ఎందుకో కార్మిక వర్గంలో ఐక్యత అవసరమని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బంగి శివ, సిపిఎం నాయకులు మధు, అంజి, రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి.