Header Top logo

పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలి – ఏఐఎస్ఎఫ్

AP 39TV 01మే 2021:

కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ, పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకి ప్రమోట్ చేయాలని శనివారం నాడు అనంతపురం నగరంలోని కొత్తఊరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి లేఖలు రాసి పంపించి వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ ఇంతటి విపత్కర పరిస్థితులలో విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని తప్పు పట్టారు. విద్యార్థుల సంక్షేమాన్ని వారి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలను విచ్చిన్నం చేసేటువంటి నిర్ణయాలు రాష్ట్రప్రభుత్వం తీసుకోవడం చాలా బాధాకరమన్నారు. విద్యార్థులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలా లేక వారి చదువు పైన దృష్టి పెట్టాలో దిక్కుతోచని స్థితిలో కి విద్యార్థులు అయోమయంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంద అని ప్రశ్నించారు. విద్యార్థుల వారి తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు సేకరించి పరీక్షలపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పై విద్యార్థులకు నమ్మకం లేకనే విద్యార్థులు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది అన్నారు. విద్యార్థులు కోర్టుకెళ్లినప్పుడే ఈ రాష్ట్రంలో విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని అర్థం అయిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే కొన్ని లక్షల మంది కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయన్నారు, కరోనా నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం కరోనా విలయతాండవం చేయడానికి ప్రభుత్వమే తలుపులు తెరిచిందనడానికి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడమేనని ఎద్దేవా చేశారు,రాష్ట్రంలోని ఆసుపత్రులలో బెడ్స్, వెంటిలేటర్స్, ఆక్సిజన్ కొరతతో అనేకమంది చికిత్స పొందుతూనే మరణం చెందుతున్నారన్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినప్పటికీ మరల ఇలాంటి మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం అన్నారు, విద్యార్థుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  వారి బాస్ చెప్పారని పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం చాలా బాధాకరం అన్నారు, తక్షణం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు, ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోను మరియు సెంట్రల్ సిలబసుకు సంబంధించిన అనేక పరీక్షలను వాయిదా వేశారని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారు, ఈ సంవత్సరమే విద్యార్థుల భవిష్యత్తు గుర్తుకొచ్చిందా పోయిన సంవత్సరం విద్యార్థులను పై తరగతులకి ప్రమోట్ చేసినప్పుడు వారి భవిష్యత్తు గుర్తుకు రాలేదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, విద్యార్థులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మూర్ఖత్వపు నిర్ణయం ఉపసంహరించుకుని విద్యార్థులకు పరీక్షల రద్దుచేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో భవిష్యత్తులో విద్యార్థులు చేసేటటువంటి పోరాటాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాల్సి వస్తుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి రమణయ్య, నగర నాయకులు మోహన్ రాజు, చందు, హేమంత్, హరి, ఈశ్వర్, రంజిత్, సురేష్, నారాయణస్వామి, అనిల్, రాము, మనోజ్, శామ్యూల్, మధు, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking