Header Top logo

Dumbu creator Bujjai డుంబు సృష్టికర్త  బుజ్జాయి

చిత్రకళ

Dumbu creator Bujjai

డుంబు సృష్టికర్త  బుజ్జాయి

ఇండియన్ కామిక్స్ పితామహుడు (Father of Indian Comic Books) *డుంబు ” సృష్టికర్త …” బుజ్జాయి ” ఇకలేరు…!!

Dumbu creator Bujjai డుంబు సృష్టికర్త బుజ్జాయి

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి.. కానీ..

భారతదేశంలో మొట్టమొదటి సారిగా “కామిక్ బుక్స్ “ప్రచురించిన చిత్రకారుడు ” దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ” అదే
నండీ.. భావకవిదేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అబ్బాయే ఈ బుజ్జాయి.!! ఈయన అసలుపేరు ” దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి”. కలం పేరు “బుజ్జాయి” .భారతదేశంలో కామిక్స్ కు ఆద్యుడు.సృష్టికర్త. బుజ్జాయి (సుబ్బరాయశాస్త్రి) 11సెప్టెంబరు, 1931న పిఠాపురంలో జన్మించారు.ఈయన రచయిత, చిత్రకారుడు. “డుంబు ” (కామిక్ పాత్ర) సృష్టికర్త కీ.శే. ‘ దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ రాజహంస వీరి ల్లిదండ్రులు.. తమిళనాడు లోని తిరువాన్‌మయురుకు 4 కి.మీ దూరంలో వుండేవారు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు “దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి” అని పెట్టుకున్నారు.

జ్జాయి " ఇకలేరు…!!

కుమారుడు రచయితే..

కుమారుడు కూడా రచయితే కావడం విశేషం. ఆయన ఆంగ్ల నవల ‘Jump Cut’ రాసాడు. బుజ్జాయి కుమార్తె రేఖా సుప్రియ సినీనటుడు నరేష్ మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్‌ కూడా తెలుగు రచయిత్రులే. కామిక్స్ సృష్టికర్తయ్యాడు.

జ్జాయి " ఇకలేరు…!!

శ్రీశ్రీ గారు చేయి పెట్టుకొని షికారుకు తీసుకెళ్ళడం

బుజ్జాయి సాంప్రదాయ చదువులు చదవలేదు‌.చిన్నతనం నుంచి చిత్రలేఖనమంటే మక్కువ. బాపిరాజు, మొక్కపాటి, పిలకా, గోఖలే వంటి మహామహుల వద్ద ఆయన చిత్రలేఖనంలో మెళకువలు నేర్చుకున్నాడు. తండ్రిదేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వల్ల చిన్నతనం నుంచే కవులు, రచయితలు, కళాకారులతో పరిచయం, సాన్నిహిత్యం కలిగాయి. ఎంతగా అంటే.. శ్రీశ్రీ గారు చేయి పెట్టుకొని బుజ్జాయికి షికారుకు తీసుకెళ్ళడం.. ఇక విశ్వనాథ సత్యనారాయణ,వంటి దిగ్గజాలతో ఆట..మాట. ఇలా బాల్యంలోనే ఎక్స్పోజర్ రావడం వల్ల పెరిగి పెద్దయి విభిన్నంగా ఆలోచించాడు. కామిక్స్ సృష్టికర్తయ్యాడు.

జ్జాయి " ఇకలేరు…!!

బుజ్జాయి పుస్తకాలు..

‘పంచతంత్ర’కామిక్స్ ను ఆయన మొట్టమొదట ఆంగ్లంలోరాశాడు. తన బాల్యం నాటి అనుభవాలను వివరిస్తూ..” నేను మి నాన్న” అనే పుస్తకం రాశాడు. 17 సంవత్సరాల వయసులోనే బుజ్జాయి ” బానిస పిల్ల ” అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి ‘కామిక్‌ స్ట్రిప్‌’ పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందాడు. బాపు రమణల ‘బుడుగు’ లాంటి క్యారెక్టర్ ” డుంబు “ను సృష్టించాడు. “నవ్వులబండి – డుంబు బొమ్మల కథలు” అనే పుస్తకాన్ని కూడా రాశాడు.

జ్జాయి " ఇకలేరు…!!

పంచతంత్ర కథలకు బొమ్మలు

తన పంచతంత్ర కథలకు స్వయంగా బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించాడు. ఆరోజుల్లోనే. లక్షలమందికి పైగా పాఠకులు వీటిని చదివారంటే అతిశయోక్తి కాదు. అలా బుజ్జాయి వురఫ్ డుంబు లక్షలాది అభిమానుల మనసు దోచుకున్నాడు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ఆయన డుంబు, భైరవ్, పెత్తందార్ కామిక్ స్ట్రిప్పులను వేసారు. అంతేకాకుండా…‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక ఆంధ్రప్రభ వారపత్రికలో. 1975 లో ప్రచురితమైంది.

గొప్ప కార్టూనిస్ట్.!!

బుజ్జాయి గొప్ప కార్టూనిస్ట్ .తెలుగులోనే కాకుండా హిందీ,తమిళ పత్రికల్లో కార్టూన్లు వేసేవాడు.ధర్మయుగ్ హిందీ వారపత్రికలో, దినమణికదిర్ అనే తమిళ వారపత్రికలో బుజ్జాయి కార్టూన్లు పాపులర్ అయ్యాయి..! ఈయన కార్టూన్ కు భాషా భేదం లేదు.యువ మాస పత్రికలో రంగుల బొమ్మలు వేసేవాడు.1906లో అంత వరకు వచ్చిన కార్టూన్లలో ఏరి కూర్చి ఓ పుస్తకంగా… తెచ్చాడు.ఆరు దశాబ్దాలకు పైగా ఇలస్ర్టేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికల్లో, ఇంకా తమిళం, ఆంగ్లం, హిందీ పత్రికల్లో ఆయన బొమ్మల కథలు పాఠకులను అలరించాయి. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషల్లో వందకు పైగా చిన్నారుల కామిక్స్‌, కథల పుస్తకాలు ముద్రించారు.

బాలబంధు’ బిరుదుతో సత్కరించింది

1959, 1960, 1961లలో వరుసగా కేంద్ర ప్రభుత్వం… ప్రోత్సాహక అవార్డులు ఇవ్వగా, 1992లో ఏపీ ప్రభుత్వం ‘బాలబంధు’ బిరుదుతో సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 91 సంవత్సరాలు వయసు గల బుజ్జాయి గురువారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.!! వారికి నివాళులు…!!

Dumbu creator Bujjai డుంబు సృష్టికర్త బుజ్జాయి

ఎ.రజాహుస్సేన్, హైదరాబాద్
(ముఖచిత్రం… మొహమ్మద్ గౌస్, హైదరాబాద్)

Leave A Reply

Your email address will not be published.

Breaking