Header Top logo

Does an impossible revolution require sacrifices? విప్లవ త్యాగాలా.?

Does an impossible revolution require sacrifices?

సాధ్యం కాని విప్లవం కోసం ప్రాణ త్యాగాలు అవసరమా..?

ఆర్. కె. మరణంతో ఆత్మవిమర్శ చేసుకోలెరా.?

ఆర్కే చనిపోయాడు! సాయుధపోరాటాల ద్వారా, వర్గపోరాటాలా ద్వారా, తుపాకీ ద్వారా ఈ సమాజంలో అసమానత్వాన్ని, ఆకలిని, అవమానాన్ని జయించవచ్చు అని నమ్మి పూర్తి జీవితాన్ని తాను నమ్మిన ఆ సిద్ధాంతం కోసమే త్యాగం చేసిన మనిషి చనిపోయాడు. విప్లవం సాధ్యమా..? సిద్ధాంతం పేరిట ప్రాణ త్యాగం అవసరమా..?  కేవలం ఒక సిద్ధాంతం కోసం ఒక నిండు జీవితాన్ని త్యాగం చేసుకోవడం కేవలం జనాలను ప్రేమించిన వాడికి మాత్రమే చాతనవుతుంది. అతను నడచిన దారి మనకు అంగీకారం కాక పోవచ్చు కానీ అతని త్యాగనిరతిని జోహార్లు అర్పించకుండా మాత్రం ఉండలేం. రాజకీయ వారసత్వాల కోసం, పదవుల కోసం కక్కుర్తిగా చొంగలు కార్చే ఇప్పటి వ్యవస్థ లో తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన కొడుకు జీవితాన్ని కూడా ఉద్యమంలో పణంగా పెట్టిన వాడికి జోహార్లు అర్పించకుండా ఎలా వుండగలం!!

నక్సలిజానికి మనం వ్యతిరేకం కావొచ్చు. హింస కి మనం వ్యతిరేకం కావొచ్చు… Ofcourse we are against it’s violent agenda, it’s cruelty in acquisition of it’s means..కానీ అది ఎందుకు పుట్టిందో..how it could acquire a sympathy among the people and depressed classes… నాణానికి అవలవైపు కూడా చూడాలి! దేశంలోని అసమానత్వం, ఆకలి, దోపిడీ, అవమానం అనే వ్యవస్థీకృత వాస్తవ ప్రతిబింబాల ద్వారా దీన్ని చూడాల్సిన అవసరం వుంది. Naxals are not against civilians అనే ఒక పల్చటి పొర ద్వారా కూడా ఆ సిద్ధాంతాన్ని పరిశీలించక తప్పదు. Does an impossible revolution require sacrifices?

దాని సానుభూతిపరులు అంటూవుంటారు..had there been no నaxalism, the governments might not have impulsed to look into the things what they are seeking for.. in areas where there was no naxalism earlier, people invited naxals because people have realised the benefits of naxalism as a pressure group’ అని. అసలా మాటకొస్తే..మనలో ప్రతి ఒక్కరిలో ఒక నక్సలైట్ ఉన్నాడనే అనుకోవాల్సి ఉంటుంది. హక్కులు తిరస్కరించబడినప్పుడు..దోపిడీకి గురికాబడుతున్నప్పుడు కొందరు తుపాకులు తీసుకుంటే, మరికొందరు కలాలను బయటకు తీస్తారు. మార్క్సిజమ్, కమ్యూనిజం ఆ కలాల నుండి ఉద్భవించినవే. కాకపోతే నక్సలిజం కలాన్ని వదిలేసి తుపాకీని గట్టిగా పట్టుకుంది. అయితే మావో అంటే తుపాకి, గాంధీ అంటే రాట్నం అని మాత్రమే సంకుచితంగా ఆలోచిస్తే ఇక్కడ చెప్పగలిగేదేమి వుండదు. గ్రీడ్ and గ్రీవిన్స్ కు ఫలితమే ఈ సిద్ధాంతం అనేదాంట్లో కూడా ఎంత వాస్తవముందో ఆలోచించాలి.

మన అదృష్ట మేంటంటే మన దేశంలో ఈ సిద్ధాంతం ఒక కామన్ ప్లాట్ఫామ్ కింద రూపాంతరం చెందలేదు. మరే ఇతర దేశంలోనైనా ఇక్కడి అసమానతలు, దోపిడీలు ఉండి ఉంటే, ఈపాటికి అక్కడ ఒక విప్లవం ప్రారంభమై ఉండేది. మన DNA ల్లో ‘మతం’ అనేది వుంది. కేవలం మన డిఎన్ఏ ల్లోని మతం ప్రభావం వల్ల మాత్రమే నక్సలిజం అనేది ఇక్కడ ఒక విప్లవ ప్రభంజనం గా మారకుండా ఆగిపోయింది.

అయితే దీనికి ఇప్పుడు కాలం కూడా చెల్లిపోయింది. A way of solving naxalism through ethical security and ethical governance…అనేది ఒక యుటోపియన్ ఐడియాలజీ. అసలు ఆ ఐడియాలజీకి విశ్వసనీయత లేదు. కాలం చెల్లిన ఈ నక్సల్బరీ ఆలోచనలకు నైతిక బాధ్యత, నైతిక ప్రభుత్వాలు అనే helucinated ఐడియాలజీతో ముడివేసి ముగింపులు ఆశించడం కుదరదు.

మన సమాజంలో హింసకు చోటుండదు. ఇక్కడ ప్రజలు మార్పు కోసం ప్రచామ్నాయాల వైపు చూస్తారు. We have strong believes in democracy and parliamentarian politics. కేవలం ఇవి మాత్రమే నిలబడతాయి చివరిదాకా.

కొడుకుల్ని, కుటుంబాల్ని చంపుకొని తమను తాము ఆహుతి చేసుకుని కూడా పీడితుల కోసం ఒక out of date సిద్ధాంతం కోసం కలలు కనడం అనేది ఒక పిచ్చితనంగా తోస్తోంది. ఇదిప్పుడు అకస్మాత్తుగా మనసుకు చాలా భారంగా కూడా తోస్తోంది. కొన్ని త్యాగాలు పిచ్చివి. ఏది ఎంతవరకు జస్టిఫై చేసుకోవాలో అర్ధం కాని కన్ఫ్యూషన్ తో.. కారం అద్దిన పుండులాగా మనసులో అవి అలాగే వుండిపోతాయి కావొచ్చు. బరువెక్కిన ఏ రెండు కన్నీటిబొట్లు కూడా ఈ విషయంలో ఏమాత్రం స్వాంతన ఇవ్వలేవు.

జల్.. జంగల్.. జమీన్ మాత్రమే నేపధ్యంగా కలలుగన్న ఆ మనిషికి చివరకు దక్కినదేమిటో అర్థమవడంలేదు. నాలుగు దశాబ్దాల కఠోరమైన ఆటవిక జీవితం..ఉద్యమం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఒక్కగానొక్క కొడుకు.. ఒంటరిదై రోదిస్తూ లాల్ సలాముల తో వీడ్కోలు చెప్తున్న భార్య… ఏం మిగిల్చుకున్నావురా నాయనా!!

111111

సోషల్ మీడియాలో పోస్ట్…

Leave A Reply

Your email address will not be published.

Breaking