ఏపీ39టీవీ న్యూస్
మే 25
గుడిబండ:- మండలం పరిధిలోని ముత్తుకూరు మందలపల్లి కొంకల్లు గ్రామ పంచాయతీలలో ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో క్లైమేట్ ప్రాజెక్ట్ వ్యవసాయం చేయడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరియు మండలంలోని మూడు గ్రామ పంచాయతీలలో నవధాన్యాలు పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ గోపాల్ రాజ్ మాట్లాడుతూ రైతులకు వర్షం ఆరంభంలోనే పంటలు ప్రారంభించేందుకు ఏపీ మాస్ సంస్థ తరఫున మండలంలోని మూడు గ్రామ పంచాయతీలకు పంట మార్పిడి పై అవగాహన నిర్వహించి నవధాన్యాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ మహిళల రైతులు తదితరులు పాల్గొన్నారు.
కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ