Dissolved childhood కరిగిన బాల్యం
Dissolved childhood
కరిగిన బాల్యం
గరీబుతనం
తన దాష్టీకపు రుచిని
పసి బాల్యానికీ పులుమి
పాశవికంగా పాండు రోగమయ్యె
బుజుపట్టిన హీనత విస్తరిస్తుందదిగో
పూసిన పువ్వులాంటి
బాలల భవిషత్తుతో బానిసత్వంలో
కుదిమి నిర్దాక్ష్యనీయంగా నియంత్రించి
నీతిమాలిన బురదలోకి దింపితే
భవిత బజారులో బంతులాడదా
వృత్తి ఉత్కృష్టమైనదే
బాల్యపు రెక్కలపై బండబరువుల మోత
వెట్టిచాకిరి చేయించేదంతా రోతే
చిగురించే చెట్టును చిదిమి
అదిమి పనిలోకి దింపెతే కంపేకదా
పాలుగారె చెక్కిళ్ళు చూడు
విద్యావారధిలేక ఆటాపాటలకు
అడ్డుకట్టలేసిన ఎదగలేని బాల్యావస్థ
అసమానతల అడ్డగొలు ముర్ఖత్వం
చావు కేకలకు దాస్యపు దాష్టీకానికి
సమాధానాలు ఎవరు చెప్పెదరు !!
శ్రీనివాస్ కట్ల
కండర క్షీణత వ్యాధిగ్రస్తుల చైతన్య కేంద్రం,
కరీంనగర్, 8125320540