Header Top logo

వినాయక చవితికి మీ ఇంటిని, మండపాన్ని ఇలా అలంకరించండి

వినాయకచవితినాడు ఇంటిని అలాగే ఇంట్లోని గణేష్ మండపాన్ని ఏ విధంగా డెకరేట్ చేయాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. క్రియేటివిటీకు పదును పెడతారు.

వినాయకుడి పుట్టినరోజును “వినాయక చవితి”, “గణేష్ చతుర్థి” గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అంగరంగ వైభవంగా ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పండుగ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వినాయక చవితికి సంబంధించిన ఫెస్టివల్ వైబ్స్ ఆల్రెడీ ప్రారంభం అయిపోయాయి. ఈ పండగకు సంబంధించిన డెకరేషన్ హడావిడిలో చాలామంది నిమగ్నమైపోయారు. గణేష్ చతుర్థి రోజు మండపం డెకరేషన్ ఎంతో కీలకం. పండ్లు అలాగే పూలతో వినాయకుడి మండపాన్ని ఎంతో ఆకర్షణీయంగా డెకరేట్ చేస్తారు. సరైన కలర్, సైజ్ పూలను సెలెక్ట్ చేసుకుని డెకరేషన్ లో తీర్చిదిద్దే ప్రక్రియతో పాటు పండ్లను కూడా బాగా డెకరేట్ చేస్తే మండపం లుక్ బాగా వస్తుంది. ఇక్కడ, కొన్ని డెకరేషన్ ఐడియాస్ ను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాం.

1. ఆరిగామి డెకరేషన్:

మీలో దాగున్న ఆర్ట్ ను ఇప్పుడు వెలుగులోకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది. ఆరిగామి లేదా జాపనీస్ ఆర్ట్ ను వెలికితీయండి. క్రియేటివ్ డెకరేషన్ తో అందరినీ మెస్మరైజ్ చేయండి. పేపర్ తో డెకరేషన్ చేయడం మీకు ఇష్టమా? చిన్న చిన్న సింపుల్ పేపర్ డిజైన్స్ ను మీరు సులభంగా తయారుచేయగలరా?

అయితే బటర్ ఫ్లైస్, హంస అలాగే గొడుగులను పేపర్ తో చక్కగా తయారుచేసేయండి. వీటిని ఒక బంచ్ గా తయారుచేసుకుని ప్లెయిన్ వాల్ పై పేస్ట్ చేయండి. లేదా వాల్ పై ఆల్రెడీ మీరు ఒక క్లాత్ తో డెకరేషన్ కోసం కవర్ చేయాలనుకున్నట్టయితే ఆ క్లాత్ పై వీటిని అందంగా అతికించండి.

ఒక థీమ్ కి కూడా మీరు స్టిక్ అవవచ్చు. ఆ కలర్ లోని పేపర్స్ ను సెలెక్ట్ చేసుకోండి. పిల్లలతో కలిసి పేపర్ తో డెకరేటివ్ పీసెస్ ను తయారుచేయండి. కలర్ కలర్ పేపర్ ఫ్యాన్స్ ను తయారుచేయండి. పిల్లలుగా ఉన్నప్పుడు పేపర్ ఫ్యాన్స్ తో ఆడిన విషయాలు గుర్తున్నాయిగా. రంగురంగుల పేపర్ తో ఫ్యాన్స్ ను తయారుచేయండి. మండపాన్ని డెకరేట్ చేయడానికి వాడండి. ఇవి గణేష్ మండపానికి వైబ్రెంట్ లుక్ ను తెస్తాయి. మండపం వెనుక వాల్ పై వీటిని చక్కటి డిజైన్ లో డెకరేట్ చేయండి.

2. గ్లాస్ జార్స్ డెకరేషన్:

గ్లాస్ జార్స్ తో డెకరేషన్ మరింత ఆకర్షణీయంగా అలాగే వైవిధ్యంగా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఇది పాకెట్ ఫ్రెండ్లీ ట్రిక్ కూడా. డెకరేషన్ లో క్రియేటివిటీని జోడించే సమయంలో ఈ ట్రిక్ హెల్పవుతుంది. ఈ గ్లాస్ జార్స్ ను లాంతర్లుగా మార్చండి. వీటిలో చిన్న చిన్న ఎల్ఈడీ బల్బ్స్ ను పెట్టండి. అందంగా మెరుస్తాయివి. వీటిని ఇంట్లోని వివిధ కార్నర్స్ లో అమర్చండి. ఇల్లంతా సందడిగా అలాగే ప్రకాశవంతంగా మారుతుంది.

3. ప్రమిదలతో అలంకరించండి:

ప్రమిదలతో డెకరేషన్ ను బేసిక్ లెవెల్ లో చేసినా హైలైట్ గా ఉంటుంది. ఇవి ఎప్పుడూ వెలుగును పంచుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా వీటిని డెకరేట్ చేయాలి. ఒక డిజైన్ అనుకుంటే ఆ థీమ్ లో ప్రమిదలను డెకరేట్ చేయవచ్చు. ఐతే, పిల్లలను మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రమిదలతో ఇంట్లోని గణేష్ మండపాన్ని డెకరేట్ చేసుకుంటే ప్రత్యేకమైన వెలుగు వస్తుంది. ఇల్లంతా వెలుగుతో నిండుతుంది.

4. పూలతో డెకరేషన్:

పూలతో డెకరేషన్ చేయాలనుకుంటే క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. వివిధ రంగు రంగుల పూలను తీసుకువచ్చి, పూజగదిని అలాగే ఇంటిని చక్కగా అలంకరించుకోవచ్చు. ఒక కలర్ ని హైలైట్ చేయాలనుకుంటే అదే కలర్ కు సంబంధించిన పూలను తెచ్చి బాగా డెకరేట్ చేయవచ్చు. అలాగే మిక్స్డ్ కలర్స్ ను కాంబినేషన్ గా వాడవచ్చు. తెలుపు, పసుపు అలాగే పర్పుల్ కలర్ పూలతో డిజైన్ కు మరింత ఆకర్షణను తీసుకురావచ్చు. సైడ్ వాల్స్ కు కూడా పూల దండను హ్యాంగ్ చేయవచ్చు.

5. థెర్మోకోల్ డెకరేషన్స్:

థర్మోకోల్ తో కూడా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. మండపం వంటి స్ట్రక్చర్ ను తయారుచేసుకోవచ్చు. ఒకవేళ, బిజీ ప్రొఫెషనల్స్ ఐతే మార్కెట్ లో అందుబాటులో ఉన్న థర్మాకోల్ మండపాన్ని కొనుక్కోవచ్చు. దాన్ని మీరు మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.

6. గ్రీన్ గణేశా:

ఎకో ఫ్రెండ్లీ డెకరేషన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే లైవ్ ప్లాంట్స్ అలాగే ఆకులతో గణపతిని ముచ్చటగా డెకరేట్ చేయవచ్చు. ఇలా డెకరేట్ చేస్తే పర్యావరణ ప్రేమికులు మరింత సంతోషిస్తారు. ఆకులతో, వెదురుతో అలాగే ప్రత్యేకమైన మట్టితో తయారుచేసిన గణేష్ ప్రతిమలు లభిస్తాయి. వాటిని ఇలా మీరు ఎకో ఫ్రెండ్లీ టచ్ తో డెకరేట్ చేస్తే మీరు మీ చుట్టూ ఉన్నవారికి పర్యావరణంపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఒక మెసేజ్ ను కూడా కన్వే చేసినవారవుతారు. అలాగే, పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు. పండగ పూర్తయ్యాక గణేశుడి మట్టి విగ్రహాన్ని వాటర్ ఉన్న బకెట్ లో పెడితే ఆ నీళ్లను మొక్కలకు పోయవచ్చు.

7. థీమ్ డెకరేషన్:

ఏదైనా థీమ్ తో డెకరేషన్ ను చేయాలనుకుంటే ముందుగానే థీమ్ గురించి ఓ క్లారిటీకి వస్తే దాన్ని బట్టి మిగతా డెకరేషన్ ఐటమ్స్ ను ఎంచుకునే వీలు అలాగే సమయం ఉంటుంది. ఉదాహరణకు, ఫ్రూట్స్ థీమ్ ఐతే వివిధ రకాల ఫ్రూట్స్ ను మీరు తెచ్చుకుని డెకరేట్ చేయవచ్చు. ఇందుకు కావాల్సిన మెటీరియల్స్ అలాగే వస్తువుల లిస్ట్ ను ప్రిపేర్ చేసుకోండి. మీ ఇంటితో సరిగ్గా మ్యాచ్ అయ్యే థీమ్ ను ఎంచుకోండి.

8. మామిడి తోరణం:

గణేష్ చతుర్థినాడు ఇంటి ఎంట్రన్స్ లో తోరణాలు కడతారు. సంప్రదాయం ప్రకారం పండుగలకు అలాగే శుభకార్యాలకు మామిడి తోరణాలను ఇంటి గుమ్మాలకు కడుతూ ఉంటారు. శుభకార్యమనగానే మామిడి తోరణాలు గుర్తుకువస్తాయి. పండుగలలో ఇది హైలైట్ అని చెప్పవచ్చు. గణేష్ మండపం ఎంట్రన్స్ ను కూడా మామిడి ఆకులతో డిజైన్ చేస్తే ముచ్చటగా ఉంటుంది. ఇంటి గడపకు మామిడి తోరణాలను కట్టడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇవి నెగటివ్ ఎనర్జీస్ ను ఇంట్లోకి రానివ్వవట.

9. రంగు రంగుల రంగోలీ:

డెకరేషన్ అంటే కేవలం గోడలకు మాత్రమే పరిమితం కాదు అంతకు మించి. గణేష్ మండపం వద్ద నేలను కూడా చక్కగా డెకరేట్ చేసేయండి. రంగు రంగుల రంగోలీతో ఆకర్షణీయంగా మార్చండి. మార్కెట్ లో లభ్యమయ్యే రంగోలీస్ ను తెచ్చుకుని ముగ్గులు వేయండి. లేదా ఇంట్లోని రైస్ ఫ్లోర్ తో ఎకో ఫ్రెండ్లీ రంగులను తయారుచేయండి. రోజ్ పెటల్స్ తో పాటు వివిధ ఫ్లవర్ పెటల్స్ ను కూడా ఇంటరెస్టింగ్ రంగోలీ ప్యాట్రన్స్ కోసం వాడవచ్చు.

సో, ఈ ఐడియాస్ మీకు నచ్చాయా? మీరు గణేష్ చతుర్థికి మీ ఇంటిని అలాగే గణేష్ మండపాన్ని ఏ విధంగా డెకరేట్ చేయబోతున్నారు? మాకు తెలియచేయండి.

Leave A Reply

Your email address will not be published.

Breaking