Header Top logo

కదిరి రథోత్సవంలో స్పృహతప్పిన వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్

AP 39TV 03ఏప్రిల్ 2021:

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో స్పృహతప్పిన ఓ వృద్ధురాలిని కానిస్టేబుల్ కాపాడారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం నిన్న జరిగింది. భారీ ఎత్తున భక్తాదులు పాల్గొన్నారు. రథం వెళ్లే దారులన్నీ జనంతో కిక్కిరిసి ఉన్నాయి. హిందూపురం సర్కిల్ లో భారీ జన సమూహం నడుమ రథం వెళ్తున్న సమయంలో జనం తోసుకున్నారు. ఆసందర్భంగా ఓ వృద్ధురాలు తోపులాటలో కిందకు పడిపోయింది. స్పృహ కోల్పోయింది. అక్కడే విధుల్లో ఉన్న రాయదుర్గం కానిస్టేబుల్ శివలింగప్ప ( పి.సి నంబర్ 3201) గుర్తించి వెంటనే వృద్ధురాలి వద్దకు వెళ్ళాడు. అప్పటికే ఊపిరాడని స్థితిలో ఆ వృద్ధురాలు ఉండటం గమనించి వెంటనే ఆమెను తన చేతులపై ఎత్తుకుని(100 మీటర్ల ) పక్కకు తీసుకొచ్చాడు. చెట్టు నీడన విశ్రాంతి కల్పించి నీరు తాపించడంతో కాసేపటికి స్పృహలోకి వచ్చింది. ఆమె కుటుంబ సభ్యుల చిరునామా కనుక్కొని వృద్ధురాలిని అప్పజెప్పారు. రాయదుర్గం కానిస్టేబుల్ శివలింగప్పను జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS  అభినందించారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking