Header Top logo

Coffee with Vaishnavism Sri కాఫీ విత్ వైష్ణవి శ్రీ న్యూ పొయెట్రీ

Coffee with Vaishnavism Sri New Poetry

కాఫీ విత్ వైష్ణవి శ్రీ న్యూ పొయెట్రీ

వైష్ణవి శ్రీ కాస్తంత కొత్తగా చేసిన ప్రయత్నం ఇది. అయితే ఒరిజినల్ మాత్రం అలానే వుంది సుమా!!
అదే ఎరుపు.. అదే ఫైర్ బ్రాండ్..!!

ఇప్పుడు ప్రస్తుత కవితలోకొద్దాం..!

పాయింట్ చిన్నదే కానీ..విస్తృతమైంది. అదేంటి చిన్నదంటూనే..మళ్ళీ విస్తృతం అంటున్నారని కదూ.. మీ అనుమానం.? అక్కడికే వస్తున్నాను.

ఆరడుగుల మనిషిలో… మంచితనం పాలెంత?

ఈ భూగోళం ఇంత విస్తృతంగా వున్నా..
మనిషెందుకు ఇమడలేక పోతున్నాడు.
కనీసం తనలో తనైనా ఇముడుతున్నాడా! అంటే అదీలేదు.
చుట్టూ గిరిగీసుకొని అదే ప్రపంచం అనుకుంటున్నాడు.
కళ్ళు మూసుకొని ప్రపంచమెక్కడుంది? నా ఇల్లే నా
ప్రపంచం అనుకుంటున్నాడు.
రోజు రోజుకూ…కుంచించుకు పోతున్నాడు!
సాయం చేసే చేతులున్నా… వాటికి పనిచెప్పలేక పోతున్నాడు.
ఎందుకు? ఎందుకు? ఇదంతా ఎందుకు?
నోరువిప్పి సమాధానం చెప్పగలమా?

ఇప్పుడు వైష్ణవి శ్రీ కొత్తగా…
ట్రై చేసిన కవిత చదవండి!!

ఒక్కోసారి కొన్ని మాటలు విన్నప్పుడు నాలోనేను నవ్వుకుంటా అదేంటో
నాకే అన్ని తెలుసని కాదు నిశ్శబ్దాన్ని మోసే ఆకాశం కూడా మబ్బులు కమ్మేసినప్పుడు మౌనంగా ఉండిపోదు
నీటి ఉధృత పెరిగిపోయిన నది కూడా శబ్దం చెయ్యక మానదు మనమూ అంతేగా లోలోపల దాచుకున్న బడబాగ్నిని కూడా ముట్టుకుని చూడాలని తెగ ఆశ పడుతుంటారు కొందరు అగ్గి ముట్టించి నిప్పురవ్వ కనిపించకూడదంటూ శాపనార్ధాలు పెడతారు ఇరుకిరుకు గదుల గోడలు బద్దలు కొట్టుకుని మరీ బైటకొస్తున్న ఇమడలేనితనాన్నిగుప్పెట్లో బంధించి మంచితనానికి ఇరకాటపు ఎర వేస్తారు. Coffee with Vaishnavism Sri

ఆ రోజు నేను నేనులా ఉండనంటే నమ్మని వాళ్ళు ఎవరుంటారు

తులసి, పనగంటి కూర , మందారం మొక్కలకు ప్రేమతో పోసే బియ్యం కడిగిన నీళ్లు సింక్ లో వొంపేస్తాను
కాస్త నాలోకి నేను కుదురుకున్నాక వాటి దగ్గరగా వెళతాను. ముఖాలు వాడిపోయి తలలు వాల్చేసి నన్నే జాలిగా చూస్తుంటాయి. మనసూరుకోదుగా మగ్గుతో కాసిని నీళ్ళు తెచ్చి వాటి గొంతు తడుపుతాను పశ్చత్తాపపడుతూనే మనుషులంతా ఇంతేనని బహుశా అవి లోలోపల నవ్వుకుంటూ ఉంటాయనుకుంట…!!

( కొత్తగా రాయాలనే చిన్న ప్రయత్నం)

వైష్ణవి శ్రీ
24.01.22

ఇది ఆత్మాశ్రయంలా కనిపించే కవితే కానీ… లోకానికి సంబంధించింది. ముఖ్యంగా మనుషులకు సంబంధించింది. విషయం చిన్నగా కనబడినా విస్తృతి ఎక్కువ అన్నది ఇందుకే. ఒక్కోసారి కొన్ని మాటలు..అవి మనగురించి మంచి కావచ్చు. చెడు కావచ్చు. వినగానే నవ్వొస్తుంది. కొందరు పెదాలపై నవ్వేస్తే..ఇంకొందరు లోలోనే నవ్వుకుంటారు. మనిషి నైజాన్నిబట్టి రియొక్షన్ వుంటుంది. ఈ కవయిత్రి రెండో తరహా తనలో తానునవ్వుకుంటుంది. అంటే తనకే అన్ని తెలుసని కాదు‌‌.

నిశ్శబ్దంగా వుండే ఆకాశంలో నల్లమబ్బులు కమ్మినపుడు వాటి గోల అందరికీ తెలిసిందే…కొంతమందైతే భయంతో
అర్జునా..ఫల్గుణా అంటూ అరవడం కొత్తేం కాదు..రాపిడి జరిగినపుడు పొగమబ్బైనా ఉరుముతుంది.ఇక మనిషొక
లెక్కా.? Coffee with Vaishnavism Sri New Poetry

 

ఇక నీటి ఉధృతి పెరిగినపుడు ప్రశాంతంగా వుండే నది కూడా పెద్దగా శబ్దం చేస్తూ ఉరకలు పరుగులెత్తుతుంది.
ఓ రకంగా..మనమూ అంతే…!

మనుషులంతా ఒకేలాగున్నా..మేకింగ్ డిఫెక్ట్ వల్ల ఒక్కొక్క రు. ఒకలా వుంటారు.ఎవరి తీరు వారిది.ఎవడి గోల వాడిది. లోలోపల దాచుకున్న బడబాగ్నిని కూడా ముట్టుకుని చూడాలని తెగ ఆశ పడేవారు కొందరు… వీళ్ళు అగ్గి ముట్టించి నిప్పురవ్వ కనిపించకూడదంటూ కండీషన్ పెడతారు..అక్కడికి వాళ్ళేదో మంచివాళ్ళలా కనబడాలనే తాపత్రయం.

ఇంకొందరు ఇరుకిరుకు గదుల గోడలు బద్దలు కొట్టుకుని మరీ బైటకొస్తున్న ఇమడలేనితనాన్ని గుప్పెట్లో బంధించి
మంచితనానికి ఇరకాటపు ఎర వేస్తారు..వీళ్ళు బయటకు కనిపించే మంచివాళ్ళు..లోపల మాత్రం దొంగ నా….లు.!!

అందుకే మనం.. మనలా వుండమంటే నమ్మని వాళ్ళు ఎవరుంటారు? చెప్పండి. సరే..అవన్నీ కాస్సేపు పక్కన పెట్టేద్దాం..! ఇప్పుడు ముఖ్యమైన మరీ ముఖ్యమైన విషయానికొద్దాం.!

మన దగ్గర అన్నీ వుంటాయి. పదిమందికి సాయం చేసే శక్తీ వుంటుంది..అయినా మనకెందుకులే? అనుకుంటాం.
మన చుట్టూ ముళ్ళ కంచెపాతుకొని,లోపలే వుండిపోతాం. కళ్ళముందు సాయం చేసే చేతులకోసం ఆర్తి వినబడుతున్నా.. చెవుల్లో దూది లేకుండానే వినబడనట్లు నటిస్తూ,పక్కకు తప్పుకుంటాం.మానవత్వాన్ని కాస్సేపు పాతరపెట్టేస్తాం.!

ఇదే విషయాన్ని వైష్ణవి శ్రీ చాలా సింపుల్ గా చెప్పారు. రోజూ అన్నం వండే ముందు ఒకటికి రెండుసార్లు బియ్యం కడుగుతాం. ఆనీళ్ళలను వృధాగా సింక్ లో వొంచేస్తాం. పారబోస్తాం.అవే నీళ్ళు మనపెరట్లోనో, ఇంటి ముందో వున్న తులసి, పనగంటి కూర , మందారం మొక్కలకు పోస్తే…వాటి దాహం తీరుతుంది.కానీ అలా చేయం.దీన్ని నిర్లక్ష్యం అందామా?మూర్ఖత్వం అందామా? తెలిసి తెలిసి చేసే నిరర్ధకపు పని ఇది.మన చేతుల్లో వున్నఆ కాసిని నీళ్ళు నాలుగు మొక్కలకు జీవనాధారమవుతుంది. ఈవిషయం అందరికీ తెలుసు.అయినా మనం ఆ కాస్త మంచిని కూడా చేయం.

పాపం నీళ్ళు లేక,దప్పిక తో అల్లాడుతూ మొక్కలు మొహాలు వేలాడేసుకొని ‘ఉస్సు’రంటూ వుంటాయి. వైష్ణవి శ్రీ కూడా అందరిలాంటిదే..బియ్యం కడిగిన నీళ్ళు ని సింక్లో వంచేస్తుంది. అయితే మొక్కలు మొహాలు చూసినప్పుడు మాత్రం..జాలిపడి తనలోకి తాను కుదురుకొని, వాటి దగ్గరగా వెళుతుంది. అవేమో .. ముఖాలువాడిపోయి తలలు వాల్చేసి తనను జాలిగా చూస్తుంటాయి. పాపం మనసూరు కోక , మగ్గుతో కాసిని నీళ్ళు తెచ్చి పశ్చత్తాపపడుతూనే వాటి గొంతు తడుపుతుంది… !

ఈ మనుషులు బుధ్ధి చూసి మనుషులంతా ఇంతేనని బహుశా అవి లోలోపల నవ్వుకుంటూఉంటాయనుకుంటా..అంటూ కవితకు శుభం కార్డు వేసింది వైష్ణవి శ్రీ…!!

ఇందుమూలంగా… తెలుసుకోవాల్సిన ‘నీతి’ ఏమంటే మనకు పనికిరాని దాన్ని వృధాగా పారేసే కంటే.. దాని
అవసరం వున్నోళ్ళకిస్తే..కొంతైనా మేలు జరుగుతుంది. మన చేతులకూ.. కాస్తైనా మంచి అంటుతుంది..!!
దాచుకుంటేనో,వృధాగా పారబోస్తేనో యేం రాదు. ఇలా వున్నదాంట్లో నలుగురికి పంచిదే ఆనందం కలుగు
తుంది..ఒక్క మాటలో చెప్పాలంటే.. పొడిబారిన ❤️ గుండెకు తడి తగులుతుంది…మీరూ ప్రయత్నించి…
చూడండి…ఏమైనా ‘దీనివల్ల వచ్చే…కిక్కే వేరబ్బా! అని అనిపించక పోతే నన్నడగండి’ అంటున్నారు వైష్ణవి శ్రీ.

మీ కొత్త ప్రయత్నానికి అభినందనలు ❤️❤️❤️.

Artist Vikas Nag Vamsi paintings

ఎ.రజాహుస్సేన్
నంది వెలుగు

Leave A Reply

Your email address will not be published.

Breaking