Header Top logo

Civil rights activist Bala Gopal Vardhanthi అక్టోబర్ 8న పౌర హక్కుల యోధుడు బాల గోపాల్ వర్ధంతి

Civil rights activist Bala Gopal Vardhanthi  అక్టోబర్ 8న పౌర హక్కుల యోధుడు బాల గోపాల్ వర్ధంతి

పౌరహక్కుల ఉద్యమానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత బాలగోపాల్ కే దక్కుతుంది. బాలగోపాల్ ఒక మధ్యతరగతి తెలుగు బ్రాహ్మణ దంపతుల ఎనిమిది మంది పిల్లలలో ఐదవ సంతానం- కందాళ్ళ పార్థనాథ శర్మ మరియు రాళ్ళపల్లి నాగమణి దంపతులకు బాలగోపాల్ 1952, జూన్ 10న బళ్ళారి, కర్ణాటకలో జన్మించాడు. ఆయన సోదరులలో ఒకరైన అనంత భారత సైన్యంలో డాక్టర్. . మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ. ఈటీవీ2లో చాలాకాలం తెలుగు వెలుగు కార్యక్రమానికి  నిర్వాహకురాలు గా ఉన్న మృణాళిని సోదరి. ఒకటి నుంచి డిగ్రీ వరకు తిరుపతిలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి, వరంగల్‌ లోని ఆర్ఈసీ నుంచి గణితంలో పీహెచ్‌డీ, 1980లో కాకతీయ విశ్వ విద్యాలయంలో గణిత అధ్యాకుడిగా ఉద్యోగంలో చేరిక, 1985లో ఉద్యోగానికి రాజీనామా, అప్పటి నుంచి హక్కుల ఉద్యమానికే పూర్తిగా అంకితం అయ్యారు.

మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి సలిపిన ప్రముఖ హBalagopal Civil rights activistక్కుల నేత, న్యాయవాది, హేతువాది మేధావి. హైదరాబాద్‌ లోని గుడిమల్కాపూర్ ప్రియా కాలనీలో నివసించాడు. ఆయన భార్య వసంత లక్ష్మి ఆంధ్రజ్యోతిలో  పాత్రికేయురాలు. వారికి ప్రభాత అనే కుమారుడు కలిగాడు. మానవతా విలువల కోసం పోరు సల్పుతు, ఆదివాసీ ఉద్యమం నుంచి విప్లవోద్యమం వరకు, పౌరహక్కుల ఉద్యమం నుంచి మానవ హక్కులు ఉద్యమం వరకు, కూలీ పోరాటం నుంచి భూపోరాటం వరకు అన్నిరకాల ఉద్యమాలతో పెనవేసుకు పోయిన నాయకు డాయన. ఎక్కడ అన్యాయం, వివక్ష, అణిచివేత, అసమానతలు కనిపించినా నిష్కర్షగా, నిక్కచ్చిగా, నిర్భయంగా పోరాడారు. ఈ క్రమంలో వచ్చిన బెదిరింపుల్ని ఏనాడూ లెక్కచేయలేదు. ఆయనపై ఎన్నోసార్లు భౌతిక దాడులు జరిగినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాడు. బూటకపు ఎన్‌కౌంటర్లను వెలుగు లోకి తేవడంతో పోలీసులు ఆయనపై నక్సలైట్‌గా ముద్ర వేశారు. కొత్తగూడెంలో ఓసారి ఆయనపై దాడికి పాల్పడిన పోలీసులు చనిపోయాడని భావించి, మురికి కాల్వలో పడేసి వెళ్లగా పీడీఎస్‌యూ కార్యకర్తలు ఆయన్ను కాపాడారు. ఆయన మానవ హక్కుల ఉద్యమంతో పూర్తిగా సంబంధం కలిగి ఉన్న తరువాత చాలా కాలం తరువాత న్యాయవాదిగా మారడానికి ఎంచు కున్నాడు

. బాలగోపాల్ 1983 మరియు 1997 మధ్య ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ (ఎపిసిఎల్సి) ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. ఎపిసిఎల్‌సి లో అభిప్రాయ భేదాల తరువాత, అతను ఎపిసిఎల్‌సిని వదిలి మానవ హక్కుల ఫోరంను ఏర్పాటు చేశాడు. 26 సంవత్సరాల కాలంలో, అతను ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర ప్రాంతాలలో ప్రభుత్వ దళాలు వేలాది మంది చట్టవిరుద్ధ హత్యల కేసులను నమోదు చేశాడు. 1980 ల చివరలో మావోయిస్టులు చేసిన కిడ్నాప్ వరుస సందర్భంగా, అప్రమత్తమైన సంస్థ ప్రజా బంధు (ఫ్రెండ్స్ ఆఫ్ ది పీపుల్) ఆయనను అపహరించి, ఇద్దరు పోలీసు అధికారులను నక్సలైట్ కస్టడీ నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసులతో సంబంధాలున్నాయని అనుమానించిన ఈ సంస్థ, అపహరణకు గురైన పోలీసులను తిరిగి ఇచ్చిన తర్వాతే ఆయనను విడుదల చేసింది.

బాలగోపాల్ 90 దశక ప్రారంభం వరకు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో ప్రచురించిన అనేక వ్యాసాలలో మాండలిక మార్క్సిస్ట్ పద్ధతిని అనుసరించాడు. సోవియట్ యూనియన్ పతనంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలగోపాల్ సమాధానాల కోసం మార్క్సిజంలో మానవతావాద సంప్రదాయాలను అన్వేషించడం ప్రారంభించాడు. 90 వ దశకంలో ఆయన వ్యాసాలు ఈ మార్పును ప్రతిబింబిస్తాయి. రాజ్యహింస తోపాటు ప్రైవేటు హింసను ఆయన వ్యతిరేకించాడు. నక్సల్బరీ ఉద్యమానికి ఎంతోమంది కార్యకర్తలను అందించిన ఆయన ఆ తర్వాత క్రమంలో విప్లవపార్టీల వైఖరిని తప్పుబట్టారు. ప్రజలకు చేరువకావడంలో ఎం.ఎల్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆయన రాసిన ‘నక్సల్బరీ ఉద్యమం, గమ్యం, గమనం’, ‘చీకటి కోణం’ పుస్తకాలు సంచలనం సృష్టించాయి.

మావోయిస్టుల హింస చర్యలపై ఆయన బహిరంగంBalagopal Civil rights activistగా విమర్శించడం నక్సలైట్ల నుండి తీవ్ర విమర్శలను ఆకర్షించింది. పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌ ఘడ్ లో జరిగిన హింసపై ఆయన చేసిన వ్యాఖ్యల తరువాత, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్ రావు… బాలగోపాల్‌ను లాల్ గఢ్ నిరోధక ప్రాంతాన్ని సందర్శించి నిజమైన చిత్రాన్ని తెలుసుకోవాలని సవాలు చేశాడు. ఆయన 2008 లో భారతదేశ ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసిన తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి సవాళ్ళపై నిపుణుల సమూహంలో సభ్యుడిగా పనిచేశాడు. మానవ హక్కులు అవిభక్త మైనవని ఆయన నమ్మాడు. అతను తన సరళమైన జీవనానికి మరియు ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో క్రమం తప్పకుండా కనిపించే విశ్లేషణాత్మక వ్యాసాలకు ప్రసిద్ది చెందాడు. ఇపిడబ్ల్యులోని అతని కథనాలలో ఇందిరా గాంధీ పాలన, రిజర్వేషన్ల సమస్య, వివిధ ప్రదేశాలలో ఎప్పటికప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన, గుజరాత్ అల్లర్లు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, భూసేకరణ, ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ, వైయస్ఆర్ ప్రభుత్వం మరియు సిపిఐ-మావోయిస్టుల మధ్య చర్చలు తదితరాలతో ఆయన పాత్ర విడదీయరానిది. రాడికల్ విప్లవం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పుకునే వారి మానవ హక్కుల ఉల్లంఘనను ఆయన తెలుగు వ్యాసం ‘చీకటి కోణాలు’ లో ప్రత్యక్షంగా ప్రశ్నించారు. మానవ హక్కుల ఫోరం ఏర్పడిన తరువాత, అతను తన కార్య కలాపాలను విస్తరించాడు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సాలో తీవ్రమైన సామాజిక గందరగోళానికి గురైన ప్రాంతాలను సందర్శించాడు.

ఒరిస్సాలో అతని నిజనిర్ధారణ బృందాలు రాయగడ జిల్లాను సందర్శించాయి. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీల పనితీరులో ఉన్న వంచనను ఆయన విశ్లేషించాడు,  బహిర్గతం చేశాడు. బాల గోపాల్ దాదాపు ఒక దశాబ్దం క్రితం న్యాయశాస్త్రం అభ్యసించడం ప్రారంభించాడు. పోలీసులు హత్యలను ఎదుర్కోవటానికి సంబంధించిన డజన్ల కొద్దీ కేసులను వాదించాడు. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన హత్యానేరం నమోదు చేయాలని ఆయన గట్టిగా వాదించి విజయం సాధించాడు. ఈ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టని పల్లె లేదు, పట్టణం లేదు. అరణ్యాల నుంచి జనారణ్యాల వరకూ ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయన తప్పని సరిగా ఆ ప్రాంతానికి వెళ్లి అధ్యయనం చేసేవాడు. అందుకే మన భౌగోళిక, నైసర్గిక స్థితిగతులపై ఆయనకున్న జ్ఞానం అపారం.ఆయన అక్టోబర్ 8, 2009 రాత్రి హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో గుండెపోటుతో మరణించాడు.

Ramakistaiah sangabhatla

రామ కిష్టయ్య సంగన భట్ల, రచయిత  సెల్:   9440595494

 

Leave A Reply

Your email address will not be published.

Breaking