‘Chakravakam’ movie shooting ‘చక్రవాకం’ సినిమా షూటింగ్
‘Chakravakam’ movie shooting
‘చక్రవాకం’ సినిమా షూటింగ్
సినిమా.. ప్రేక్షకుల మనసులను దోచుకునే రెండున్నర గంటల సినిమా.. కానీ ఆ సినిమాను తీయాలంటే ఎన్ని రోజులవుతుందో.. 4 డిసెంబర్ 2021న ఉదయం సికింద్రాబాద్ లోని కొంపల్లిలో రోజులా వాకింగ్ కు వెళ్లాను.
పార్క్ లో యోగసనాలు చేసి ఇంటికి తిరిగి వస్తుంటే ఓ భవనం ముందు సినిమా షూటింగ్ నడుస్తోంది.
ఒక్కోసీన్ కు ఎన్ని టెకాఫ్ లు తీసుకుంటున్నారో.. పెద్ద భవనం నుంచి కంపెనీ సీఇవో బయటకు వచ్చి రోడ్ పైన గల కారు డోర్ తీస్తూ అటు ఇటు చూసి వెళ్లి పోతాడు. ఈ ఒక్క సీన్ తీయడానికి పదిహేను నిముషాలకు పైనే టైమ్ పట్టింది.
సినిమా తీస్తుంటే థియేటర్ లో కనిపించే పాత్రలు చాలా తక్కువ. మరీ.. తెర వెనుక చాలా మంది కష్టపడుతుంటారు.. సినిమా పేరు ‘చక్రవాకం’ అని ఆ షూటింగ్ వద్ద ఉన్న ఒకరు చెప్పారు.
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్
949 222 5111