Header Top logo

Birthday of Ganakokila P. Sushilamma పి.సుశీలమ్మ పుట్టినరోజు

Birthday of Ganakokila P. Sushilamma
నవంబర్ 13న గానకోకిల పి.సుశీలమ్మ పుట్టినరోజు

పాటలగొంతుకకు కమ్మదనం అద్దిన సుశీలమ్మ!!
భాషతో నిమిత్తం లేని సార్వత్రిక గాయని ఆమె !!
నవంబర్ 13న గానకోకిల పి.సుశీలమ్మ పుట్టినరోజు..!!

పులపాక సుశీల వురఫ్ పి సుశీల గాయకురాలు. విజయనగరంలో 1935 నవంబరు 13న కుటుంబంలో జన్మించింది. తండ్రి పేరు పి.ముకుందరావు, క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం సాధారణ గృహిణి. 86యేళ్ళ జీవితంలో 70ఏళ్ళ సంగీత ప్రస్థానం. వినడానికే అబ్బురం కలిగించే విషయం.సంగీత ప్రియుల కుటుంబంలో పుట్టిన సుశీల చాలా చిన్న వయస్సులోనే విజయనగరం సంగీత కళాశాలలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంతో పాటు హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ తదితర భాషలలో 50 వేలకు పైగా పాటలను పాడింది. భాష ఏదయినా కావచ్చు. కమ్మని కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణకి సుశీలమ్మ పెట్టింది పేరు.

పాటల ప్రస్థానం

1950లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీల ఎన్నికైంది‌..ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ” ఎదుకు అలత్తాయ్” అనే పాటను (1952) తొలిసారిగా పాడింది. 1952 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా కొత్త రికార్డు నెలకొల్పింది. సుశీల తన మాతృభాష తెలుగులో కాకుండా తమిళంలో సంగీతం ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.

Birthday of Ganakokila P. Sushilamma

సుశీలమ్మ తమిళుల ఆడపడుచుగా

నిజానికి సుశీలమ్మ ను తమిళులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. తమిళంలో నిలదొక్కుకోవడానికి సుశీల చాలా కష్టపడింది.తమిళ భాష, ఉచ్చారణ విషయంలోప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇదిలా వుండగా1954లో ‘మాడిదున్నో మారాయ’ అనే కన్నడ చిత్రంతో కన్నడభాషా చిత్రాలలో పాటలు పాడటం ప్రారంభించింది. చాలా తక్కువ కాలంలోనే కన్నడీయుల ప్రేమాభిమానాలను చూరగొంది. గానకోకిల గాన సరస్వతి,కన్నడ కోగిలె అన్న బిరుదుల్ని పొందింది.

మహిళా గాయనిలతో పోటీపడి

1955-1960లలో సినీ సంగీత పరిశ్రమను శాసిస్తున్నపి.లీల, ఎం.ఎల్. వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ మహిళా గాయనిలతో పోటీ పడి మరీ నిలదొక్కుకుంది సుశీలమ్మ. ప్రత్యేకమైన వ్యక్తీకరణలు, సృష్టమైన స్వర మాధుర్యంతో సంగీతంపై తనదైన ముద్ర వేసుకుంది. 1955 సంవత్సరంలో సుశీలమ్మ తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలలో బ్యాక్ టు బ్యాక్ హిట్ పాటలతో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. 1955 లో విడుదలైన మిస్సమ్మలో కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు పాడింది. అదే సంవత్సరం విడుదలైన తమిళ చిత్రం “కనవనే కాన్ కందా దేవం”లో పాడిన పాటలకు పురస్కారం లభించింది. Birthday of Ganakokila P. Sushilamma

శ్రీ భాగ్య రేఖ – జననీ జననీ” పాట

‘చండి ప్రియ’ చిత్రంలో జయప్రద నృత్యం కోసం పాడిన “శ్రీ భాగ్య రేఖ – జననీ జననీ” అనే పాట ప్రేక్షకులలో అత్యంత గుర్తింపును తీసుకొచ్చింది. 1960 వ సంవత్సరంలో సుశీల ‘ సీత ‘ చిత్రానికి వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి జి. దేవరాజన్, ఎం. కె. అర్జునన్ వంటి మలయాళ స్వరకర్తలతో అనేక విజయవంతమైన పాటలను రికార్డ్ చేసింది. కె. జె. యేసుదాస్‌తోకలిసి ఆమె అనేక మలయాళ యుగళగీతాలను పాడింది.

Birthday of Ganakokila P. Sushilamma

అవార్డులు

1968 నవంబరు 29 న విడుదలైన ఉయర్ధ మణితన్ తమిళ చిత్రంలోఎం.ఎస్. విశ్వనాధన్ స్వరకల్పన చేసిన “పాల్ పోలేవ్” (naalai intha velai paarthu) పాట గాత్రం చేసిన సుశీలకు 16 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.అదే పాటకు ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా పొందింది. 1970 వ దశకంలో సుశీల దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకున్న ఏకైక గాయనిగా రికార్డు నెలకొల్పింది.1987 లో విశ్వనాథ నాయకుడు చిత్రంలో “కవిజన సమజా బోజ” పాటకు జాతీయ వుత్తమ గాయనిగా అవార్డ్ అందుకున్నారు సుశీలమ్మ.

లతమ్మతో స్నేహం

మేష్టారుతో పాటల ప్రయాణం

నైటింగేల్ ఆఫ్ ఇండియాగా భావించే లతా మంగేష్కర్ తో సుశీలమ్మకు స్నేహం, సాన్నిహిత్యం వుంది. లతామంగేష్కర్ కు సుశీలమ్మ ఎంతో ప్రేమను చూపేవారు. వీరిరువురి మధ్య స్నేహం దశాబ్దాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పట్ల ఎంతో సాన్నిహిత్యం, గురుభక్తి వుండేవి. యుగళ గీతమనేసరికి ఘంటసాల, సుశీలమ్మ కాంబినేషన్ కు తిరుగుండేదికాదు. వీరిరువురి డ్యూయెట్ వుందంటే అది సూపర్ హిట్టే. Birthday of Ganakokila P. Sushilamma

 ఎమ్మెస్ విశ్వనాధన్ గురువు

ఎం.ఎస్. విశ్వనాధన్ ను తన గురువుగా భావిస్తుంది సుశీలమ్మ. ఆయన సంగీత దర్శకత్వంలో 1955-1995 వరకు ఆమె పాడిన పాటలలో ఎక్కువ భాగం ప్రజాదరణ పొందినవే కావడం గమనార్హం. కె.వి.మహదేవన్, లక్షీకాంత్ ప్యారేలాల్, ఎల్.వైద్యనాథన్, లక్ష్మీ కిరణ్, ఎస్.ఎల్.మనోహర్, అజిత్ మర్చంట్, జి.దేవరాజన్, ఎస్. ఎన్. త్రిపాఠి వంటి సంగీత దర్శకులతో ఈ కాలంలో ఆమె హిందీ పాటలను కూడా రికార్డ్ చేసింది. మనోహర్, అజిత్, జి. దేవరాజన్, ఎస్.ఎన్. త్రిపాఠి,మరొక గొప్ప సంగీత దర్శకుడు ఇళయరాజా కోసం కొన్నిముఖ్యమైన పాటలు పాడింది. 1980 నుండి యం.యస్. విశ్వనాధన్ ఇళయరాజాతో తన బలమైన అనుబంధంతో జానకి వారితో మంచి స్థానం సంపాదించినప్పటికీ, సుశీల 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగింది.

Birthday of Ganakokila P. Sushilamma

గిన్నిస్ బుక్ రికార్డు

1985 తరువాత కూడా అనేక మంది సంగీత దర్శకులు సుశీలను ప్రథమ ఛాయిస్ గా ఎంపికచేసుకునేవారు. 1986 తరువాత కూడా ఆమె చలన చిత్ర హిట్ పాటల ఎంపిక చేసుకుని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించడం విశేషమే. వివిధ భాషలలో సుమారు 18,000 పాటలు పాడి, “గిన్నిస్ బుక్ రికార్డు ” స్థాపించింది సుశీలమ్మ. ఎవరైనా ఇంతకన్నా ఏం చేయగలరు..? ఇంకేం సాధించగలరు? కొంత కాలంగా మారిన సినీ పాటల ట్రెండ్ నచ్చక స్వచ్ఛందంగానే సినీరంగం నుంచి నిష్క్రమించింది. మా రోజుల్లో ఎక్కువ సినిమా పాటలు హాయిగా వినగలిగేట్టు ఉండేవి. ఇప్పటి పాటలలో ఎక్కువ శాతం ఉద్రేకాన్ని పెంచేవిగా ఉంటున్నాయి. అందుకే స్వచ్ఛందంగా పాటల ప్రపంచం నుండి నిష్క్రమించింది.

Mahaprasthana of Bapu dolls-9

ఎ.రజాహుస్సేన్, రచయిత
హైదరాబాద్

Leave A Reply

Your email address will not be published.

Breaking