Header Top logo

Batakh Mia Ansari who saved Gandhi is life గాంధీజీ ప్రాణాలు కాపాడిన‌ బతఖ్ మియా అన్సారి…!!

Batakh Mia Ansari who saved Gandhi is life గాంధీజీ ప్రాణాలు కాపాడిన‌ బతఖ్ మియా అన్సారి…!!

 

భారతదేశాన్ని బానిస సంకెళ్ళ నుంచి విముక్తి గావించిన  జాతిపిత మహాత్మాగాంధీ ప్రాణాలు ఎంత విలువైనవో వేరే చెప్పాల్సిన పనిలేదు. అటువంటి గాంధీజీ (Batakh Mia Ansari who saved Gandhi is life) గారి ప్రాణాల్ని కాపాడాడు ఓ వంటవాడు. అతని పేరు బతఖ్ మియా అన్సారి. ఈ దేశం ఎల్లకాలం గుర్తుంచు కోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి అన్సారి. దురదృష్టమేమంటే గాంధీని చంపిన గాడ్సే మనకు తెలుసు, కానీ గాంధీజీ ప్రాణాలను కాపాడిన బతఖ్ మియా అన్సారి మాత్రం మనకు తెలీదు.

చరిత్రకు పట్టిన గ్రహణం అన్సారీ త్యాగాన్ని కప్పేసింది.

ఎవరో ఎందుకు చివరకు గాంధీజీ కూడా తన ఆత్మ కథలో కానీ, మరేదైన సందర్భంలో కానీ “ బతఖ్ మియా” పేరును

కనీసం ప్రస్తావించక పోవడం ఆశ్చర్యమే. ఈ ఉదంతానికి సంబంధించిన కథాకమామీషు ఇప్పుడు తెలుసుకుందాం.

***        ****

‘బతక్ మియా’  ఉదంతం తెలుసుకోవాలంటే ముందు మనం బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా  కేంద్రమైన

‘మోతిహార్ ‘ కు వెళ్ళాలి.

అది 1917 వ సంవత్సరం.

నీలితోటల రైతుల సమస్యల్ని పరిశీలించడానికి గాంధీ మహాత్ముడు అక్కడకు చేరుకున్నాడు. నీలి మందు తయారు చేసే కర్మాగారాలకు చంపారన్ ప్రసిద్ధి. ఆంగ్లేయ యజమానులు భారతీయ రైతులను దోపిడీ చేసి లాభాల్ని దండుకుంటున్నారు. భారత రైతాంగం సన్నకారు, చిన్నకారు రైతులు ఆంగ్లేయ యజమానులు ప్రభుత్వ మద్దతుతో రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఆంగ్ల యజమానులు “తీన్ కతియా “ఒప్పందాన్ని భారత రైతులపైరుద్దుతూ, తావాన్, జిరాత్, అబ్ వాబ్ లాంటి వివిధ రకాల పన్నులను బలవంతంగా వసూలు చేస్తున్నారు. రైతులమీద జరుగుతున్న దాష్టీకాలను వివరిస్తూ, ఇక్కడి  బాధిత రైతులను ఆదుకోవాల్సిందిగా ఈ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ శుక్లా,  పీర్ మహమ్మద్ మూనీస్ అన్సారి విజ్ఞప్తి మేరకు గాంధీజీ చంపారన్ ప్రాంతానికి చేరుకున్నారు. రైతులంతా వచ్చి ధైర్యంగా తమ సమస్యల్ని పూస గుచ్చినట్టు చెబుతున్నారు. గాంధీజీ ఆలకిస్తున్నారు. నిజాలు ఎక్కడ బయటపడతాయోనని ఆంగ్ల యజమానులు గాంధీజీ అడ్డు తొలిగించాలని నిర్ణయించారు.ఈ పనిని అతి దుర్మార్గుడైన “ఇర్విన్“ కు అప్పజెప్పారు. ఇర్విన్ రంగంలోకి దిగాడు. గాంధీజీని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు.. గాంధీజీ ఇర్విన్ ఆతిథ్యాన్ని అంగీకరించారు. బాబూ రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఇర్విన్ ఇంటికి వెళ్ళాడు. (Batakh Mia Ansari who saved Gandhi is life)

పాలల్లో విషం..ఇర్విన్ కుట్ర…!!

గాంధీజీ భోజనానికి వచ్చినపుడు పాలల్లో విషం కలిపి ప్రాణాలు తీయాలని వ్యూహం పన్నాడు ఇర్విన్.

తన ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న బతఖ్ మియాను పిలిచి తన కుట్రను తెలియజేశాడు. బతఖ్  మియా  ససే

మిరా అన్నాడు. ఇర్విన్ బెదిరించాడు. భయపెట్టాడు. తన మాట వినకపోతే నరకం చూపస్తానన్నాడు. కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తానని బెదిరించాడు. బతఖ్ మియాకు ఏం పాలుబోలేదు.బతఖ్ మియాను నయానా ఒప్పించాలని  ‘ఇర్విన్ ‘ ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. ఎన్నోఇనాములు ఇస్తానన్నాడు. జీతం పెంచుతానని, కొంత భూమి కూడా ఇస్తానని ఆశపెట్టాడు. విషం కలిపిన పాలను ఇర్విన్ తెచ్చి బతఖ్ మియాకు ఇచ్చాడు. బతఖ్ మియా పాలను తీసుకు వెళ్ళి గాంధీ చేతికిచ్చాడు. అంతటితో ఊరుకోలేదు.

ఈ పాలల్లో విషం కలిపి వుంది. మీరు తాగొద్దని హెచ్చరించాడు. గాంధీజీ ఆ పాలను తాగలేదు. ఇర్విన్ పథకం బెడిసికొట్టింది. కుట్ర గాంధీజీకి తెలిసిపోయింది. ఇర్విన్ దుర్మార్గం బయటపడింది.

బతఖ్ మియా కష్టాలు…!!!

గాంధీజీని కాపాడానన్న తృప్తి అయితే మిగిలింది కానీ… నిజానికి బతఖ్ మియా కష్టాలు అప్పుడేమొదలయ్యాయి. ఇర్విన్ ఉగ్రుడై బతఖ్ మియాను చిత్రహింసలకు గురిచేశాడు. ఉద్యోగం నుంచి తొలిగించాడు. ఆస్తిపాస్తుల్ని జప్తు చేయించాడు! ఇంటిని వేలం వేశారు. ఆంగ్లపోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. భౌతికంగా ,మానసికంగా హింసించారు. చివరకు ఊర్లో  (  సిస్వా అజ్ గిరి )  నుండి తరిమేశారు. బతఖ్ మియా కుటుంబంతో సహా ఊరొదిలి వెళ్ళి పోయారు. చాలాకాలం దాకా బతఖ్మియా ఎక్కడున్నదీ.. ఎవరికీ తెలీదు! (Batakh Mia Ansari who saved Gandhi is life)

గాంధీజీ చంపారన్ పర్యటన విజయవంతమైంది.1917 జూన్ 5న రాంచిలోబీహార్..ఒరిస్సాగవర్నర్ సర్ ఎడ్వర్ట్ గెయిట్  గాంధీజీతో జరిపిన చర్చల పర్యవసానంగా సర్ ఫ్రాంక్ళస్లే నేతృత్వంలో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది!. మహాత్ముడు కూడా ఆ కమిలో ఒకసభ్యుడు.

ఈ విచారణ కమిటీ1917 నవంబరు 29న తన నివేదికను సమర్పించింది. రైతులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనని, కమిటీ తేల్చింది. రైతుల నుండి తెల్లదొరలు తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలని, తీన్ కతియా రివాజును రద్దు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీసిఫార్సుల్ని నీరు కార్చాలన్న ప్రయత్నాలూ జరిగినా, చివరకు “Champaran Agrarian Act of 1918 “వచ్చింది!ఈ చట్టం రాకతో 100 సంవత్సరాలుగా అమల్లో వున్న తీన్ కతియా విధానం ద్దయింది.!(మహాత్మాగాంధీ ఆత్మకథ..పుట369)

చంపారన్ ప్రాంత రైతులకు న్యాయం జరిగినా.. అందుకు  కారణమైన గాంధీజీ ప్రాణాల్ని కాపాడిన బతఖ్ మియా అన్సారీకి మాత్రం అన్యాయమే జరిగింది. కనీసం గాంధీజీ కూడా బతక్ మియాను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఊరినుంచి వెళ్ళగొట్టబడిన బతఖ్ మియా, అతని కుటుంబం ఎక్కడుందో?  ఏం చేస్తున్నారో అన్న విషయం ఎవరూ పట్టించుకోలేదు! అలా కాలం గడిచిపోయింది.

(Batakh Mia Ansari who saved Gandhi is life)

Mahatma Gandhi, Batakh mia ansari

సీన్ కట్ చేస్తే…

బతఖ్ మియా విషయం ఎలా తెలిసింది?

*అది 1950 వ సంవత్సరం  సభాస్థలి…..మోతిహార్ అది.. భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన సభ.  డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తున్నారు.

‌అప్పుడు సభలో ఓ మూలనుండి ఓ ‘ముసలాయన ముందుకొచ్చి రాజేంద్ర ప్రసాద్ ను కలవాలని బిగ్గరగా అరుస్తున్నాడు. పోలీసులు అడ్ఢగిస్తున్నారు. కానీ ముసలాయన మాత్రం వినడం లేదు. ఒక్కసారి రాజేంద్రప్రసాద్ ను కలవాలని పోలీసుల్ని బతిమాలుతున్నాడు అక్కడేం జరుగుతుందో అని రాజేంద్రప్రసాద్ అటుకేసి చూశారు.

ఆ ముసలాయన్ను చూసి రాజేంద్ర ప్రసాద్ నిర్ఘాంత పోయారు. అతను గాంధీజీ ప్రాణాల్ని కాపాడిన “బతఖ్ మియా…”రాజేంద్ర ప్రసాద్ కు  గతం కళ్ళ ముందు మెదిలింది.(ఆ రోజు ఇర్విన్ ఇంట్లో గాంధీజీతో పాటు తానుకూడా వున్నాడు.) రాజేంద్ర ప్రసాద్ ఆనందానికి హద్దుల్లేవు.బతఖ్ మియాను సాదరంగాసభా వేదికపైకి ఆహ్వానించారు. బతఖ్ మియా వేదికపైకి రాగానే రాజేంద్ర ప్రసాద్ గట్టిగా కౌగిలించుకున్నాడు. తన పక్కనే వున్న కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. జనమంతా ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయారు.

ఎవరాయన? ఎవరాయన..??

అంటూ ఎంక్వయిరీ చేయడం మొదలు పెట్టారు

ఆ ముసలోడు ఎవరై వుంటాడన్న ఉత్సుకత ఎక్కువైంది.

సభికుల ఉత్సుకతకు ఫుల్ స్టాప్ పెడుతూ భారత రాష్ట్రపతిరాజేంద్ర ప్రసాద్ 1917లో జరిగిన సంఘటన

ను గుర్తుచేశారు.

ఆ సమయంలో గాంధీజీ పై జరుగనున్నహత్యాయత్నాన్ని వమ్ము చేసిన మహాపురుషుడు బతఖ్ మియా ఈయనే “ అని చెప్పగానే సభలో పెద్దగా హర్షనాదాలు, కరతాళ ధ్వనులు వినిపించాయి.

ఆతర్వాత ఇర్విన్ తనను ఎలా బాధపెట్టాడో? తానుఎంతగా నష్టపోయాడో బతఖ్ మియా నోట విన్న  రాష్ట్రపతి ఖిన్నుడయ్యాడు. వెంటనే జిల్లాకలెక్టర్ ను పిలిచి ‘బతఖ్ మియా.. అతని ముగ్గురు కుమారులు షేర్ మహమ్మద్ అన్సారి, మహమ్మద్ రషీద్ అన్సారి, మహమ్మద్ జమాల్ అన్సారి కుటుంబాల బతుకుతెరువు కోసం 36 బీగాల (50/25/24ఎకరాలు/ బీగాలు అంటూ వేర్వేరు ఉల్లేఖనాలు పేర్కొంటున్నాయి) (పదేళ్ళ వయసులో గిరీశ్ మిశ్రా ఈ సభలో పాల్గొన్నాడు.ఆయన 2010లో Main  stream weekly లోరాసిన ఓ వ్యాసంలో నాటి సంఘటనను సవివరంగా పేర్కొన్నాడు..) (నాటి చంపారన్ ఘటనలకు సంబంధించి విస్తృతంగా పరిశోధించిన డాక్టర్ మొహమ్మద్ సజ్జాద్ కూడా సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని ధృవీకరించారు.)

(Batakh Mia Ansari who saved Gandhi is life)

***   ****

దేవుడు వరమిచ్చినా….!!

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి కదా….

రాష్ట్రపతి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు కదా! ఇక భూములొస్తాయి. తమ కష్టాలు గట్టెక్కుతాయనుకున్న బతఖ్ మియాకు, అతని కుటుంబానికి ఆ సంతోషం ఎన్నోరోజులు నిలవలేదు! ఏడు సంవత్సరాలపాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని కాలేదు,భూములు రాలేదు. చివరకు బతఖ్ మియా 4..డిసెంబర్1957 లో కన్ను మూశాడు. 1957డిసెంబరు 3న రాష్ట్రపతి అదనపు ప్రయివేటు కార్యదర్శి విద్యానాథ్ వర్మ నుండి  రాష్ట్రపతి  ఆదేశాలను ధృవీకరిస్తూ లేఖ కూడా వచ్చింది. ఆ తర్వాత 1958 డిసెంబర్ 3న బతఖ్ మియా పిల్లా పాపలను ఢిల్లీకి ఆహ్వానించారు భారత రాష్ట్రపతి!.వాళ్ళందరితో ఫోటోలు దిగారు.(Hindustani MusalmanokaJunge ..e?.Azadi mein hissa,syed Ibrahim Fikri ,new Delhi1999,page,23)

*రాష్ట్రపతి ఆదేశించినా కూడా….!!

బతఖ్ మియా,అతని ముగ్గురు కుమారులకు సాగు భూమి ఇవ్వాలని రాష్ట్రపతి లిఖితపూర్వకంగా

ఆదేశాలు పంపినా కూడా ఆచరణలో అమలు కాలేదు. అలా అధికారుల చుట్టూ తిరగ్గా.. తిరగ్గా‌చివరకు 1958లోబతఖ్ మియా నివాసముంటున్న ఊళ్ళో(సిస్వా అజ్గరి ) కాకుండా, నూరు మైళ్ళదూరంలో వున్న ఎక్వాపరస్వాని గ్రామంలో ఆరు ఎకరాలు కేటాయించారు. ఎలాగూ భూమిని ఇచ్చారు కదా అని బతఖ్ మియా కుటుంబం ఎక్వాపరస్వాని గ్రామానికి తరలివెళ్ళింది. తీరా ఆ భూమి అటవీ శాఖ వారిదని లిటిగేషన్ పడింది. ఈ వివాదం ఆరు సంవత్సరాలు నడిచింది. చివరకు భూమి స్వాధీనమైంది. అయితే ఆ భూమి నదీ పరివాహక ప్రాంతంలో వుండటంతో వ్యవసాయ యోగ్యం కాలేదు! బతఖ్ మియా కుటుంబం కష్టాలు తీరలేదు.

1990 లో రాష్ట్రపతి ఆదేశాలను, బతఖ్ మియాకు జరిగిన అన్యాయాన్ని బీహార్ రాష్ట్రమైనారిటీ సెల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చింది.అయినా బతఖ్ మియా కుటుంబానికి న్యాయం జరగలేదు. 2004 లో బీహార్ శాసనసభ లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.ఆతర్వాత ఓ దశాబ్దం గడిచి పోయింది 2010 జనవరి,22న మహాత్ముడి ప్రాణ రక్షకుడు బతఖ్ మియా అన్సారి కుటుంబం‌ దయనీయ స్థితిని వివరిస్తూ హిందుస్తాన్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది.ఈ వార్తకు అప్పటి‌ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కార్యాలయం స్పందించి, చంపారన్ జిల్లాకలెక్టర్ కు లేఖ రాసింది. ప్రథమ రాష్ట్రపతి ఆదేశాలను అమలు చేయాలని ఆ లేఖలో కోరింది. నాటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈవిషయాన్ని అంగీకరించినా కూడా అసలు పని కానేలేదు. బఖత్ మియా తరం నుంచి మొదలైన ఈ తతంగం ఇప్పటికీ పూర్తికాలేదు. ఇప్పుడు బతఖ్ మియా మూడో తరం నడుస్తోంది.

రాష్ట్రపతి ఆదేశాలు, రాష్ట్రపతితో దిగిన ఫోటోలను పట్టుకొని అధికారుల చుట్టూ ఇంకా తిరుగుతూనే వున్న పనిమాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుంది!

*చరిత్ర విస్మరణ…!!!

బతఖ్ మియా ఉదంతాన్ని చరిత్రకారులెవరూ రికార్డు చేయని కారణం ఇంతవరకూ తెలీదు!  అలాగే గాంధీజీ

కానీ, లేక రాజేంద్రప్రసాద్ కానీ బతఖ్ మియా ఉదంతాన్ని ఎక్కడా పేర్కొనకపోవడం ఆశ్చర్యమే. కేవలం బతఖ్మియా  గురించే కాదు.. చంపారన్ సంఘటనలో గాంధీజీ కి సహకరించిన షేక్ గులాబ్,పీర్ మహమ్మద్ మూనీస్, హర్ బన్స్ సహా హ్, శీతల్ రాయ్ లాంటవార్ల పేర్లుకూడా గాంధీజీ తన ఆత్మకథలో మాటమాత్రంగా కూడా ప్రస్తావించక పోవడం ఎందుకోఅర్థం కాదు!

“ఏడు దశాబ్దాలు దాటినా…!!

బతఖ్ మియాకు భూ కేటాయింపుకు సంబంధించి ప్రథమ రాష్ట్రపతి ఆదేశాలిచ్చి 72 ‌సంవత్సరాలు దాటుతున్నా…నేటివరకు సదరు ఆదేశాలు అమలు కాలేదంటే ఏమనాలి?! ఇదేనా ? మనం కోరుకున్న స్వాతంత్రం, స్వరాజ్యం? ఇటువంటి ఎంతమంది బతఖ్ మియాలు చరిత్ర అట్టడుగున కూరుకుపోయి వున్నారో కదా!

బతఖ్ మియా త్యాగం లోకానికి తెలిసింది చాలా తక్కువ.

ప్రస్తుతం బతఖ్ మియా గురించి  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో  కూడా‌‌  ప్రచారం చేస్తున్నసయ్యద్ నశీర్ అహమ్మద్ ఎంతైనా అభినందనీయుడు. అంతేకాదు బతఖ్మియా పుస్తకం తెలుగులో రాసి,దాన్ని వివిధ భాషల్లోకి అనువదించి దేశవ్యాప్తంగా ఉచితంగా అందజేసే కార్యాన్ని తలకెత్తుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ తదితర భాషల్లోకి ఈ పుస్తకం అనువదించబడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతరరాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఈ పుస్తకాన్ని ఉచితంగా అందజేశాడు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72యేళ్ళుదాటుతున్నా.. మన జాతిపిత.గాంధీజీ ప్రాణాల్నికాపాడిన మహోన్నత వ్యక్తి బతఖ్ మియా అన్సారీకి ,అతని కుటుంబానికి ఇంకా న్యాయం జరగక పోవడం దురదృష్టం.!!

(Batakh Mia Ansari who saved Gandhi is life)

ఓ కాలమా…..

ఇది నీ జాలమా

ఓ స్వాతంత్ర్యమా

ఇది నీ రాజ్యమా ?

 

ఎ.రజాహుస్సేన్, కవి అండ్ రచయిత,  ఫొటో.. మొహమ్మద్ గౌస్

Leave A Reply

Your email address will not be published.

Breaking