Header Top logo

SFI 51 వ వసంతోత్సవంలో అడుగు పెట్టిన సందర్బంగా, SFI ఆధ్వర్యంలో 5మండలాల క్రీడాకారులకు బహుమతులు పంపిణి.

ఏపి 39 టీవీ 10 ఫిబ్రవరి 2021:

SFI 51 వ వసంతోత్సవంలో అడుగు పెట్టిన సందర్బంగా, SFI ఆధ్వర్యంలో 5మండలాల క్రీడాకారులకు బహుమతులు పంపిణి.రాయదుర్గం పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ నందు నిర్వహించిన బహుమతుల అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో గల స్కూల్స్ లలో మరియు కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు రెండు రోజులుగా క్రీడా పోటీలు ఏర్పాటు చేయడమైనది.పోటీలో గెలిచిన విద్యార్థులకు విన్నర్స్ మరియు రన్నర్స్ లకు బహుమతులు అందించడం జరిగింది.
బాలురు మరియు బాలికలకు విడి విడిగా పోటీలు నిర్వహించడం జరిగింది, ఆ పోటీలు కబడ్డీ, వాలీబాల్, షటిల్, టెన్నిస్, 100 మీటర్స్ రన్నింగ్ మొదలగు పోటీలను నిర్వహించడం జరిగింది, పిల్లలలో క్రీడా ప్రతిభను గుర్తించి, వారిని జిల్లా స్థాయిలో, మరియు రాష్ట్ర స్థాయిలో క్రీడలలో పాల్గొనేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని వైజాగ్ రిబ్కా అన్నారు.విద్యార్థులకు SFI ఎప్పుడు అండగా ఉంటుంది, మీలోని ప్రతిభను రాష్ట్రానికి, దేశానికి మీ సేవలు అవసరం ఎంతైనా ఉంది అని SFI నాయకుడు శివ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడినారు. వైజాగ్ రవి మాట్లాడుతూ విద్యార్థులకు మీలోని ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లేందుకు మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో MEO నాగమణి, గర్ల్ హై స్కూల్ HM రమాదేవి, గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చంద్రమౌళి,ఉపాధ్యాయులు, బహుమతులు స్పాన్సర్స్ వైజాగ్ రిబ్కా 29వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, వైజాగ్ రవి, శివపుత్ర 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, జానకిరామ్, SFI నాయకుడు శివ, విజేతలు రన్నర్స్, విన్నర్స్, శిరీష, చరిత, మేఘన, తేజ, విద్యార్థులకు 48 మంది విద్యార్థులకు షీల్డులు,30 మెడల్స్ అందిందించి విద్యార్థులకు ఉత్సాహం నింపడం జరిగింది. ఇందులో మరియు SFI బృందం అనిల్, జోసఫ్, పాలనాయక్, ప్రతాప్, హరి, లోకేష్, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

 

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇన్చార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking