ఏపి 39టీవీ 02ఫిబ్రవరి 2021:
కదిరి పట్టణం స్వగృహం నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్ మైన్ ద్దీన్ మాజీ కౌన్సిలర్ మాట్లాడుతూ భారతదేశంలో రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీ నరేంద్రమోడీ ఆధ్వర్యంలో దేశంలో అట్టడుగు వర్గాలకు అనగారిన వర్గాల అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులై అనాది కాలం లోనే భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నన్ను నా సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ లో మైనార్టీలకు క్రిస్టియన్లకు వ్యతిరేకమని దుష్ప్రచారాన్ని నమ్మవద్దని చెప్పి నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యతలు అప్పజెప్పి నందుకు రాష్ట్ర కమిటీ నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు శుభాకాంక్షలు తెలియజేసే ఘనంగా సన్మానం చేయడం జరిగింది నా ఎంపికకు సహకరించిన బిజెపి ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు కి ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వై కె ఎస్ నేషనల్ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కి ,మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాబ్జి కి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద్ కి, జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ రెడ్డి కి ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తేపల్లె రామకృష్ణ తలుపుల, గంగాధర్ ఉత్తమ్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు dl ఆంజనేయులు ,జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ,వెంకటేష్ ,సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో మత పెద్దలు మదర్ సాబ్, ఫక్రుద్దీన్ ,అల్తాఫ్ ,మైనారిటీ మోర్చా టౌన్ అధ్యక్షులు రియాజ్ ,మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో సముచిత స్థానం కల్పించడం అయినది మైన్ ద్దీన్ కి బాసటగా నిలుస్తామని భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని మైనార్టీ మత పెద్దలు ఆశీర్వదించి హామీ ఇవ్వడం జరిగింది.