అనంతపురము మార్కెట్ యార్డ్ సెక్రెటరీ వీరయ్య గారి ఆకస్మిక మరణం రైతాంగానికి తీరని లోటు
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురము మార్కెట్ యార్డ్ సెక్రెటరీ వీరయ్య గారి ఆకస్మిక మరణం రైతాంగానికి తీరని లోటు అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు.గుండెపోటుతో మృతి చెందిన అనంతపురము మార్కెట్ యార్డ్ సెక్రెటరీ వీరయ్య గారి మృతదేహానికి బుధవారం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.అనంతపురము మార్కెట్ యార్డ్ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే వీరయ్య గారు యార్డ్ అభిరుద్దికి చేసిన కృషి మరువలేనిదన్నారు.మృదుస్వభావిగా రైతులకు మేలు చేసేలా మార్కెట్ యార్డ్ అభిరుద్ది చెందేలా వీరయ్య గారు నిర్ణయాలు తీసుకునే వారన్నారు.ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెంట మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏ కే ఎస్ ఫయాజ్ ఉపాధ్యక్షులు ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.