Header Top logo

Amritarao Jayanti on October 21 తమనంపల్లి అమృతరావు జయంతి

Amritarao Jayanti on October 21

విశాఖ ఉక్కు కర్మాగారం సాధించిన పోరాట యోధుడు అమృత రావు

అక్టోబర్ 21న తమనంపల్లి అమృతరావు జయంతి

తమనంపల్లి అమృతరావు. ఈ పేరు చాలా మందికి తెలియదు. 55 ఏళ్ళక్రితం విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఒక పోరాట యోధుని మొండి పట్టు, మొక్కవోని దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సఫలం కాగా, నేడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, పోరాడి తెచ్చుకున్న ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాబోతోంది. ఈ నేపద్యంలో నాడు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం దీక్షా దక్షులై విజయం సాధించి గొప్ప పోరాట యోధుని గుర్తుకు చేసుకోవాల్సిన తరుణం, సందర్భం.

పోరాట యోధుడు అమృత రావు

విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదం ఒక వజ్రాయుధం. విశాఖ ఉక్కు కర్మాగారం సాధన ఉద్యమానికి 55ఏళ్లు దాటినా, సాధించిన కర్మాగారం ప్రైవేటు పరం కాకుండా తిరిగి ఉద్యమ కార్యాచరణ 250 రోజులు దాటినా అదే నినాదం ఇంకా మాత్రం ఖంగుమంటూనే ఉంది. ఆ నినాదానికి అమృతం పోసి శాశ్వతం చేసిన మహనీయుడు టి. అమ్మృతరావు. అలా ఉక్కు పరిశ్రమను ఏర్పాటులో, తద్వారా ఆధునిక విశాఖ నిర్మాణంలో ఆయన పాత్ర అపూర్వం,  అనిర్వచనీయం. అమోఘం. ఆయన పుట్టింది… విశాఖలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందు కేనని నేటికీ తలుచుకుంటుంటే ఆయన లక్ష్య సాధన వెనక అమృత రావు కృషి స్పష్టం అవుతుంది.

పోరాట యోధుడు అమృత రావు133

1920 అక్టోబరు 21 తేదీన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విశదల గ్రామంలో ఆరుళప్ప అన్నమ్మ దంపతులకు అమృత రావు జన్మించారు. చిన్న తనం నుండి రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. కర్నూలు జిల్లా డోన్లో విద్యాభ్యాసం చేసిన అమృతరావు చిన్న వయస్సు లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో కొంతకాలం పనిచేశారు. నైజాం ప్రాంతంలో జరిగిన రజాకార్ల ఉద్యమంలో పాల్గొన్న అమృత రావు నిజాం రైల్వే శానిటరీ ఉద్యోగ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. భాషా ప్రాతి పదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రకాశం పంతులు నివాస గృహం ఎదుట నిరాహార దీక్ష చేశారు. పొట్టి శ్రీరాములు చేస్తున్న దీక్ష నేపథ్యంలో పలువురు రాష్ట్ర నాయకుల సూచన మేరకు నిరాహార దీక్షను విరమించారు.

విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటన చేసినా కూడా అది ఆచరణకు నోచుకోలేదు. దాంతో, రాష్ట్ర, కేంద్ర పాల కుల ఉదాశీనత ఓ వైపు, మరో వైపు ఉక్కు పరి శ్రమ వేరే రాష్ట్రాలకు తరలి పోతుందన్న ఆందోళన నేపధ్యంలో చెప్పిన మాటకు కట్టుబడి విశాఖలో ఉక్కుపరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందే నని ఎలుగెత్తి అరచి ఒకే ఒక గొంతు అమృతరావుదే. అంతవరకూ విశాఖకు ఉక్కు పరిశ్రమ కావాలని కోరిన వారే తప్ప దాని, ఆచరణాత్మక కార్యక్రమాలు చేపట్టింది లేదు. పతాకస్థాయికి చేర్చి భారీ ఉద్యమాన్ని నిర్మించిన ఘనత మాత్రం అమృతరావుదే నని చెప్పాలి. ఆ 1966 సంవత్సరం అక్టోబర్ నెల 14వ తేదీ ఆరో ఓ మహెూద్యమానికి శ్రీకారం చుట్టిన రోజు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 56 రోజులు అకుంఠిత దీక్ష చేపట్టి,  అమరణ దీక్షలోనే అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు బాటను నడచి, చరిత్ర గర్వించిన మరో గొప్ప ఉద్యమానికి ఆవిష్కరణ జరిగిన రోజు. అదే “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” నినాదంతో అమృతరావు చేపట్టిన పోరు.

అమృతరావు విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఆమరణ దీక్ష చేపట్టగా.. “విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు”నినాదంతో ఆంధ్ర దేశాన్ని కుదిపేసింది.ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణాలను కోల్పోయారు. విద్యార్థులు బందులు నిర్వహిం చారు. ఈ దీక్ష రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులను కదిలించింది. వామపక్షాలను ఉద్యమం వైపు అడుగులు వేయించింది. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాధం, యం.వి.భద్రం, రావిశాస్త్రి, చౌదరి సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. అమృతరావు దీక్షకు మద్దతుగా జనసంఘ్‌ పార్టీ నాయకులు, ప్రజాపార్టీ నాయకులు దీక్ష చేశారు. రోజులు గుడు స్తున్నా. ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా అమృతరావు వెనక్కు తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ఉక్కు కల్పమే చూపించారు.

అమృతరావు దీక్ష విరమింప జేయాలని నాటి పీసీసీ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, వావిలాల గోపాల కృష్ణయ్య, అప్పడు దొర, భాట్టం శ్రీరామ్మూర్తి కొందరు కాంగ్రెస్‌ నాయకులు కేంద్రాన్ని కోరారు.అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పాటు, ఎంపీలు, మంత్రులు అంతా కూడా ఆయనను దీక్ష నుంచి విరమించు కోమని కోరారు. అదేం కుదరదు కచ్చితమైన ప్రకటన రావాల్సిందే, లేదా నా చావును అంతా చూడాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆఘమేఘాల మీద ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలను కలసి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని గురించి వివరించారు. అప్పటికే కొత్తగా ప్రధానమంత్రి అయిన శ్రీమతి ఇందిరా గాంధీ దృష్టిలో విశాఖ ఉక్కు ఉద్యమం పడింది. అమృతరావు మొండితనాన్ని గురించి ఆమె తెలుసుకున్నారు. విశాఖలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని లిఖిత పూర్వకంగా ఇచ్చారు.  కాసు బ్రహ్మానందరెడ్డి విశాఖకు నేరుగా వచ్చి,  కలెక్టరేట్ వద్ద దీక్షలో ఉన్న అమ్మృతరావుకు కేంద్రం ప్రకటనను వినిపించి, నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఆ విధంగా విశాఖలో 1971లో ఉక్కు కర్మాగారం ఏర్పడింది. ఆయన సతీమణి చిరంజీవి కూడా గుంటూరులో విశాఖ ఉక్కు కోసం పది రోజులు ఆమరణ దీక్ష చేయడం గమనార్హం.

అమృతరావు తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేయదలచి గాంధీజీ మిషన్ అనే సంస్థను స్థాపించారు.1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. గుంటూరు పట్టణం లో పొట్టి శ్రీరాములు నగర్ ఏర్పాటుకు కృషి చేసి వందలాది నిరు పేదలకు వసతి సౌకర్యం కలిగించారు 1971లో జై.ఆంధ్ర ఉద్యమంలో ఆది ఆంధ్ర సేవను స్థాపించారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతోవారి అభ్యున్నతికి కృషి చేశారు. అమృతరావు హైదరాబాద్ జంట నగరాలలో సెట్విన్ బస్సుల ఏర్పాటుకు కృషి చేశారు. జాతీయ ప్రొహిబిషన్ కౌన్సిల్ సభ్యుడిగా వ్యవహరించారు. మన పుణ్య భూమి వారపత్రికకు సంపాద కులుగా వ్యవహరించిన అమృతరావు 1989 ఏప్రిల్ 27న కన్నుమూశారు.

Ramakistaiah sangabhatla1

   రామ కిష్టయ్య సంగన భట్ల

9440595494

Leave A Reply

Your email address will not be published.

Breaking