Header Top logo

Amma is equal to God దైవంగా భావించే అమ్మను

Amma is equal to God
అమ్మ దేవుడితో సమానం

దైవంగా భావించే అమ్మను

మనల్ని కన్నపుడు ఆ తల్లి ఎన్నెన్ని
నొప్పులు భరించిందో!!??
ఎన్ని కష్టాలను మోసిందో దయగల
ఆ ప్రేమమూర్తి!!??
పొత్తిళ్ళలోనూ… పురుడు పోసుకున్నప్పుడూ…
ఊహించని ప్రేమను..ఊహకందని
ఎన్ని ఆశలను తన మనసులో
ప్రోగుచేసుకుందో!!??

అమ్మగా మనల్ని ఎన్ని తిట్టినా
మన బతుకు బాగోగుల గురించే!!…
మన జీవితాలను
ఓ మంచి దారిలో పెట్టడానికే!!..
ఓ ఇంటివాళ్ళను చేయడానికే!!…
ఆ తిట్లే మనకు ఎప్పటికీ ఆశీర్వచనాలు…అక్షింతలు…
మన పురోగతికి అవే హేతువులు…
అమ్మ నోటితిట్లే మనకు సర్వదా శిరోధార్యమై… దీర్ఘాయుష్మాన్బవ అంటూ దీవిస్తుంటాయి…

ఎన్ని సమస్యలు ఎదురైనా…
తన కళ్ళలో కాంతి,మనసులో శాంతి
ఎప్పటికీ తరిగిపోనివి…
మన ఆలనాపాలనా చూసుకుంటూ
ఆప్యాయతతో హత్తుకొని
తన ఒడిలో దాచుకుంటుంది…
మనలోని అణువణువునూ..
ఆనందంతో తన కళ్లలోనే దాచుకుంటుంది…
తన కళ్లెదుటే మన తపనను చూసి
ఆర్ద్రతతో కన్నీరు కారుస్తుంది…

అమ్మతనాన్ని కమ్మగా అందించి..
మనలోని చైతన్యజ్వాలకు
ఆజ్యం పోస్తుంది…
మనలో నిద్రిస్తున్న జాగృతిని
తన తిట్లతోనే తట్టి లేపుతుంది!!..

వాస్తవసమాజంవైపు నడిపించడానికి
మన హృదయతలుపుల్ని నిత్యంతట్టి..
మనసుపొరలను సుతారంగామీటి..
కొత్తఊపిరిని పోస్తుంది…
కుళ్లు,కుతంత్రాల లోకం నుండి
మనల్ని కాపాడడానికి ఎన్నో అగచాట్లుపడుతుంది…
అమ్మ అంటే ఇంతేనేమో
అనిపించేస్తూ ఉంటుంది…

ఆధునిక సమాజంలో నేడు
కొందరు అమ్మతనాన్ని
అసహ్యించుకుంటున్నారు…
పొత్తిళ్లలో దాచుకొని కనిపెంచిన కన్నతల్లిని ఆ పొత్తిళ్లనే హేళన చేస్తు అమానుషంగా కాళ్ళతోనే తన్నేస్తున్నారు…
తమజన్మకే కళంకాన్ని అపాదించుకొని పాపాన్ని మూటగట్టుకుంటున్నారు…
వృద్ధురాలైన ఆతల్లి కన్నీరు పెట్టుకునేలా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు.
అవిటిదాన్నిచేసి రోడ్డుపై
కొందరు నెట్టేస్తున్నారు..

ఇదేనా తల్లి రుణం తీర్చుకోవడం!!??

మనకు జన్మనివ్వడానికి మరోజన్మను ఎత్తి పుడమిపైకి తెచ్చిన కన్నతల్లి దైవంకన్నా గొప్పదని గ్రహించు…
నిన్ను ఈలోకానికి పరిచయం చేసిన అపురూపదేవత ఆ కన్నతల్లే అనే వాస్తవాన్ని కలలోనైనా విస్మరించకు…
కన్నవారిని పూజించి గౌరవించిన నాడే సమాజంలో మనకు మనుగడ…
అదే మన అభ్యున్నతికి నిజమైన అడుగుజాడ.

ambati narayana

అంబటి నారాయణ
నిర్మల్,9849326801

Leave A Reply

Your email address will not be published.

Breaking