చత్తీస్ గడ్ రాష్ట్రంలో యుద్ద వాతవరణం

మా సత్యం సుక్మా జిల్లాలో ఆదివాసులపై 11 జనవరి, 2023 నాడు ఎయిర్ బాంబింగ్ దాడుల పట్ల నిజ నిర్ధారణ కై CDRO ఆధ్వర్యంలో ఫిబ్రవరి1,2023 న చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాకి వెళ్లారు. నిజ నిర్ధారణ సభ్యులపై ఆ ప్రజాస్వామికంగా CRPF, రాష్ట్ర DRG సాయిధ పోలీసులు వేధింపులకు గురిచేసి అక్రమంగా నిర్బంధించి 2 వ తేదీ ఉదయం 10 గంటలకు వదిలిపెట్టారు.

కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాల పిరికి చర్యకు నిదర్శనం. ఈ భారత దేశంలో భారత సర్వోన్నత న్యాయస్థానం పనిచేస్తున్నదా!? పాలకుల ఫాసిస్ట్ చర్యలను చూస్తూ, మౌనం వహించడం అంటే సమర్థించడమే.

చత్తీస్ గడ్  కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల ఆప్రజాస్వామిక దాడుల పట్ల వైమానిక దాడులతో ఆదివాసులపై
సుక్మా జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా 11 జనవరి, 2023 నాడు వేసిన ఎయిర్ బాంబింగ్ దాడుల పట్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఇంతవరకు సుమోటాగా స్వీకరించకపోవడం ఫాసిస్ట్ కోర్టుకు నిదర్శనం.

భారత పాలకులు, బెనిటో ముస్సోలిని ఫిలాసఫిని కాలకూట కాషాయ తీవ్రవాద ప్రధాని కార్పొరేట్ శక్తి తో ఏర్పడిన ప్రభుత్వం విభిన్న రూపాలలో అణచివేత చర్యలు అమలు చేస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్ సమక్షంలో యుద్ధ ప్రకటన చేశారు. పాలకుల ప్రతి అణచివేత చర్యల వెనుక Benito Mussolini ఫిలాసఫీ అంతర్లీనంగా దాగి ఉంది.

అందుకు ఈ క్రింది ఉదాహరణలు:
“We do not argue with those who disagree with us, we destroy them.”
“మనతో విభేదించే వారితో మేము వాదించము, వారిని నాశనం చేస్తాము”.
“Fascism should more appropriately be called Corporatism because it is a merger of state and corporate power”.
“Peace is absurd: Fascism does not believe in it.”
Benito Mussolini
ఈనాడు భారత సర్వోన్నత న్యాయస్థానం పాలకుల ఫాసిస్ట్ విధానాలకు లోబడి
ఫాసిస్ట్ కోర్టుగా పనిచేస్తుంది.
నిరంకుశ పరిపాలన పట్ల ఈ దేశ ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి!?
—-మా సత్యం
Down Down Indian
fascist GovernmentCDRO ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్‌కి చత్తీస్గఢ్ పోలీసులు నిజానిర్దారణ కు అనుమతి నిరాకరించడం, టీమ్ సభ్యులను వేధించడం, దేశ ప్రజలకు సమాచారం తెలియకుండ అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..

– ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (FACAM) .

ఫిబ్రవరి,1నుండి5,2023 తేదీల్లో CDRO ఆధ్వర్యంలో చత్తీస్గఢ్ రాష్ట్రంలో నిజానిర్దారణ కోసం బయలు దేరిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ మరియు ఢిల్లీకి చెందిన 25 మంది సభ్యులతో కూడిన ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థ బృందాన్ని (CDRO) ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని దుబ్బతోట గ్రామంలోని శివారు దగ్గర క్యాంప్ చెక్‌పాయింట్ వద్ద ఫిబ్రవరి 1వ తేదీ,2023 బుధవారం రాత్రి 8 గంటల సమయంలో అక్రమంగాకేంద్ర CRPF, రాష్ట్ర DRG సాయుధ పోలీసులు అడ్డుకున్నారు .

ఈ అక్రమ నిర్బంధాన్ని,వేదింపులను ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (FACAM) తీవ్రంగా ఖండిస్తున్నది.. CDRO బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టారు . ముందుకు వెల్లడానికి అనుమతించ లేదు. ఆ పరిసర ప్రాంతంలోని హోటళ్ల ను దుకాణాలను బలవంతంగా మూసివేసి వారికి కనీసం ఆహారం దొరక కుండా చేశారు .

అంతేకాకుండా, సరైన ఆశ్రయం పొందేందుకు సమీపంలోని దుబ్బతోట ‘పంచాయత్ భవన్’కు వెళ్లేందుకు కూడా అనుమతించలేదు. విశ్రాంతి ఏర్పాట్ల కు విఘాతం కలిగించి చివరకు ఒక రేకుల షెడ్డు లో ఉంచారు.మొదటి రోజు రాత్రి అక్కడే గడిచింది .

రెండవ రోజు ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 గంటలకు, చివరకు వారిని స్థానిక క్యాంప్ కమాండర్ వదిలిపెట్టారు, 3 కిమీ దూరంలో ఉన్న మరొక క్యాంపు చెక్ పాయింట్ వద్ద మళ్ళీ ఆపారు.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ మరియు సుక్మాలోని వివిధ గ్రామాలపై జరిగిన ఏరియల్ బాంబు దాడుల గురుంచి పరిశోధించడానికి ఈ బృందం ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్’లో భాగం గా అక్కడికి వెళ్ళింది .

బుర్జి మరియు ఇతర ప్రాంతాలలో శిబిరాల వ్యతిరేక ఉద్యమాలపై రాజ్య అణచివేత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయితీ పొడిగింపు (PESA) చట్టం ప్రకారం “గ్రామసభ యొక్క సమ్మతి” కోరే నిబంధనలను ఉల్లంఘించి రోడ్లు మరియు శిబిరాలను నిర్మించడానికి అక్రమ బలవంతపు భూ సేకరణ అంశాలను పోలీసు సూపరింటెండెంట్ మరియు సుక్మా జిల్లా కలెక్టర్‌తో పాటు బుర్కాపాల్ డిఎస్‌పిని కలుసుకుని, తెలియజేసాం.

ఫిబ్రవరి1వతేది 2023న సుక్మా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నిజానిర్దారణ కు సుక్మా నుండి డోర్నపాల్ వరకు వస్తున్న దారిలో మూడు స్థలాల్లో మరియు 150 CRPF దుబ్బతోట బెటాలియన్ వద్ద సాయుద పోలీసులు రోడ్డుపై వాహనాల తనిఖీల పేరున అడుగడుగునా అడ్డగించి CDRO బృందానికి ఆటంకాలు కల్పించి 36 చివరి కి డోర్నపాల్ క్యాంప్ వద్ద అడ్డగించి ఈరోజు సాయంత్రం 5 :00గంటల సమయంలో రాత్రి అవుతుందని, CDRO బృందాన్ని వెనక్కి పంపించి వేశారు.

మిగతా వాహనాలను, ట్రాక్టర్ల ను అనుమతిస్తూ CDRO బృందాన్ని ఉద్దేశ్య పూర్వకంగా నిలిపివేశారు. ఆ రాత్రి డోర్నపాల్ లో చిన్నచిన్న హోటల్ లతో పాటు ఏ హోటల్ లో CDRO బృందానికి అన్నం దొరకకుండా బెదిరించి మూసివేయించారు. రాత్రి దగ్గరలోనే ఆరుకిలోమీటర్ల్ దూరంలో ఉన్న దుబ్బతోట గ్రామపంచాయతీ భవనం లో ఆరాత్రి పడుకుందామనిపోతున్న CDRO బృందాన్ని, CRPF, DRG మరియు ఛత్తీస్‌గఢ్ పోలీసులు భారీ వలయంగా అడ్డుకొని అక్రమంగా NH30 హైవేరోడ్డుపక్క నున్న ఆదివాసీ పటేల్ రేకుల షెడ్లో రాత్రంతా నిర్బంధం చేసినారు.

అధికారులకు చెప్పిన సమాచారం గురించి బృందం చెప్పినప్పుడు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారులు దానిని అంగీకరించడానికి సున్నితంగా నిరాకరించారు .
“మేము కేంద్ర బలగాలము . రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుండి మేము ఆదేశాలు తీసుకోము” అని చెప్పారు .

రోడ్డు మార్గాల ద్వారా ఎవరిని అనుమతించకుండా ఒక నిర్బంధ వాతావరణం సృష్టించడం వలన మరియు కేంద్ర-రాష్ట్ర సాయుధ పోలీసు బలగాల నిరంతర వేధింపుల కారణంగా “ఫ్యాక్ట్ ఫైండింగ్” బృందం తన విచారణను రద్దు చేసుకోవలసి వచ్చింది.

బయటి పరిశీలకులు, జర్నలిస్టులు, కార్యకర్తలు మరియు మానవ హక్కుల పరిరక్షకులపై ఈ రకమైన ఆంక్షలు ఎందుకంటే ,పౌర సమాజం నుండి ఎటువంటి నిరసన లేకుండా తమ మారణహోమ చర్యలను కొనసాగించడానికి సాక్షులు లేకుండా యుద్ధాన్ని సృష్టించడానికి పోలీస్ దళాలు చేస్తున్న ప్రయత్నమని అర్థం చేసుకోవాలి.

ఆపరేషన్ గ్రీన్-హంట్‌తో ప్రారంభమైన ఈ సమాచార అణిచివేత ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ కింద అనేక రెట్లు పెరిగింది, ప్రతి 3-4 కి.మీ దూరంలో నిర్బంధ క్యాంప్ శిబిరాలు నిర్మించి, కార్పొరేట్ దోపిడి ప్రయోజనాల కోసం బస్తర్ ప్రజలపై విధ్వంసం సృష్టించడమే కాకుండా ప్రజాస్వామ్య శక్తులకు మార్గాన్ని నిరాకరించాయి.

కేంద్ర ప్రభుత్వం, చత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నిర్బంధ అప్రజాస్వామిక చర్యల పట్ల నిలదీస్తున్నాము . ఛత్తీస్‌గఢ్‌లో వైమానిక దాడులు నిర్వహించడం లేదని చెబుతున్న బస్తర్ రేంజ్ ఐజి చెప్పేది నిజమే అయితే CDRO బృందం నిజానిర్దారణ జరిపేందుకు వెళుతుంటే ఎందుకు భయపడుతున్నారు మరియు నిజనిర్ధారణ కమిటీ కి ఎందుకు అనుమతి నిరాకరించారు?

ఏ సత్యాన్ని వారు దాచిపెట్టి , పాతిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? సమాధానం తెలుసు: ఇండియన్ ఆర్మీ ఆదివాసీ గ్రామాలపై చేసిన వైమానిక దాడులు బయటి సమాజానికి తెలువద్దని ఈ నిర్బంధ అణిచివేతలు.

ఇది దేశంలోని ఆదివాసీలపై ఆపరేషన్ సమాధాన్ – ప్రహార్ కింద

రాష్ట్రం చేసిన నరమేధ యుద్ధం.

మా డిమాండ్స్

NHRC లేదా సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలతో కూడిన బృందం తో ఈ సంఘటనలపై వాస్తవాలను వెలికి తీయడం ..

 యుద్ధ-ప్రాంతాన్ని సందర్శించటానికి ప్రజాస్వామ్య, పౌర మరియు మానవ హక్కుల కార్యకర్తలు మరియు జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకం లేకుండా అనుమతించండి.

ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనల గురించి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి .

మావోయిస్టు ఉద్యమంతో పోరాడే మిషతో కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై రాజ్య అణచివేతను ఆపండి..

ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ ఆపి వేయాలి.

ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (FACAM) .
2 ఫిబ్రవరి,2023.
న్యూఢిల్లీ.

– అచ్యుత సత్యనారాయణ రావు మంచాల

ఫేస్ బుక్ నుంచి..

Leave A Reply

Your email address will not be published.

Breaking