భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:-పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో నవభారత్ లో ఇంటి స్థలం 90 గజాలు… జ్యోతి అనే మహిళకు మరియు భూక్య క్రాంతి, వాసం పద్మ అను ఇరు వర్గాల మధ్య ఇంటి స్థలం విషయంలో ఘర్షణ జరుగుతుంది.. స్థలం పరిష్కారం కోసం తహసిల్దార్ కార్యాలయానికి ఇరువర్గాలు కలవగా ఘర్షణలకు దారితీశాయి అదే క్రమంలో తాసిల్దారు భగవాన్ రెడ్డి చాంబర్ నుండి బయటకి వెళ్లండి అని తను కూడా వెళ్ళిపోయారు తన పై ఉద్దేశపూర్వకంగా దాడి చేయించారని జ్యోతి అనే మహిళ మనస్థాపానికి గురై ఎమ్మార్వో చాంబర్ నందు ఫ్యాన్ కి ఉరి వేసుకోవటానికి ప్రయత్నించింది.