Header Top logo

సిపిఐ 96వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పాల్వంచ: స్వాత్రంత్రోద్యమానికి పూర్వమే పురుడుపోసుకొని ప్రజల్లో మమేకమై ప్రజాస్వామ్యానికి జీవం పోస్తోందని కమ్యూనిస్టులేని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కె. సాబీర్‌ పాషా అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 96వ వార్నికోత్సవాలను శనివారం పాల్వంచ పట్టణ, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్ళు, బస్తీలు, గ్రామాల్లో సిపిఐ జెండాలను ఆవిష్కరించి అమరవీరులను నివాళులర్పించారు. తహశీల్దార్‌ కార్యాలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన అమరవీరులు దేవభక్తిని రమేష్‌, పాశం శ్రీనివాసరావు, దుగ్గినేని చంద్రశేఖర్‌ల స్మారక స్ఫూపాన్ని ఆవిష్కరించి
పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ నేటి పలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాయని, వీరి విధానాలను నిరసిస్తూ బలమైన ఉద్యమాలు నిర్వహించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక కమ్యూనిస్టు పార్టీ పోరాటం, తాగ్యగం ఉందన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ప్రపజల కష్టసుఖాల్లో పాలుపంచుకొని వారి భాద్యతను మోస్తోంది కేవలం కమ్యూనిస్టులేనన్నారు. సుధీర్గ కమ్యూనిస్టు పోరాటంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు ప్రజలకోసం తమ ప్రాణాలు అర్చించారని అన్నారు. నాడు జరిగిన స్వాతంత్రోద్యమం, రజాకార్ల పోరాటంలో అమరులైన త్యాగధనుల స్పూర్తితో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన భాద్యత నేటితరం నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. అనేక వాగ్గానలతో గద్దెనెక్కుతున్న భూర్జువా పార్టీలు ఆ వాగ్దానాలు విస్మరించి ప్రజలపై భారాలో మోపుతున్నారన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న చట్టబద్ద హక్కులను సైతం పాలకులు నిర్వీర్యం చేస్తూ ప్రజలను కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. పోడు భూముల సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ హామీని విస్మరించి పేద పోడురైతులపై యుద్దం ప్రకటిస్తున్నాడన్నారు. ఆరేళ్ళ బిజెపి, కేసీఆర్‌ పాలన కార్చోరేట్లకు, పెట్టుబడి దారులకు అనుకూలంగా సాగిందే తప్ప పేద ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. 96వ ఆవిర్భావ వార్నికోత్సవాల స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంలబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎందగడుతూ ఉద్యమాలు నిర్మించాలని అప్పుడు నాటి అమరవీరులకు ఘనమైన వాళులర్చించినవారమవుతామన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాధం, జిల్లా సమితి సభ్యులు అడుసుమల్లి సాయిబాబు, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, బండి నాగేశ్వర్‌రావు, ఉప్పుశెట్టి రాహుల్, వి. పద్మజ, సిపిఐ, ప్రజాసంఘాల నాయకులు బాగం రాంప్రసాద్‌, ఉపేంద్రాచారి, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, నరహరి నాగేశ్వర్‌రావు, గుండాల నాగరాజు, ఉప్పుశెట్టి సునీల్‌కుమార్‌, సత్యనారాయణ, చేరాలు, దుగ్గిరాల సుధాకర్‌, జ్యోతుల రమేష్‌, రామాచారి, రవి, మైనేని వెంకన్న, వెంకట్, రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking