శ్రీకాకుళం, పొందూరు న్యాయమైన బదిలీ నిబంధనలు కావాలని, ఉపాధ్యాయుల బదిలీల ను వెబ్ కౌన్సిలింగ్ బదులు MANUAL COUNSELLING ద్వారా జరుపాలని, బదిలీలకు నేటివరకు ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను ప్రదర్శించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు FAPTO అధ్వర్యంలో గత రెండు నెలల నుండి ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు వేధింపులకు గురి చేయడం చాలా బాధాకరం. DEO కార్యాలయాల PICKETING లతో పాటు పాఠశాల సంచాలకుల కార్యాలయాన్ని ముట్టడించడం, విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నాలు చేయడానికి FAPTO పిలుపునిచ్చింది. రెండు కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా FAPTO ఉద్యమ కార్యక్రమాన్ని నీరు కార్చడానికి, ఉపాధ్యాయులను బెదిరించ డానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేయడం తగదు. కర్నూల్ లో FAPTO సంఘ నాయకులపై కేసులు పెట్టి FIR నమోదుచేశారు. APTF – 1938 బాధ్యులు హృదయ రాజు, కర్నూల్ జిల్లా FAPTO చైర్మన్, సెక్రెటరీ జనరల్ తో సహా 15 మందిపై FIR నమోదుచేశారు. తాజాగా FAPTO రాష్ట్ర సెక్రెటరీ జనరల్ DTF రాష్ట్ర అధ్యక్షులు కె.నరహరి గారిపై ” ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులను మన్యవల్ కౌన్సెలింగ్ కొరకు తప్పుదారి పట్టిస్తున్నాడనీ, CCA Rules కు విరుద్ధంగా నడుచుకుంటున్నారని notice పంపి ఎంక్వైరీ చేయమని పాఠశాల విద్య సంచాలకులు, పశ్చిమ గోదావరి జిల్లా DEO ను ఆదేశిస్తూ ఉత్తర్వులను విడుదల చేయడం అత్యంత దురదృష్టకరం. ఒకవైపు ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ విద్యా పరిపాలన అని ప్రకటిస్తూ, మరో వైపు వేలాది ఉపాధ్యాయులు కోరుతున్న డిమాండ్లను అధికారులూ పట్టించుకోవడం లేదు. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం నాశనమై పోయింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలవల్ల, అహంకార పూరిత చర్యల వల్ల పాఠశాల విద్యా రంగానికి తీవ్ర నష్టం కలుగుతూ వుంది. తక్షణమే పాఠశాల విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి జ్యోక్యం చేసుకొని, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను, FAPTO పెట్టిన ప్రతిపాదనలను పరిశీలించి, పాఠశాల విద్యా రంగాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గురుగుబెల్లి వెంకటరావు,ప్రజానేత్ర – రిపోర్టర్,