భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు 4వ రోజైన నేడు స్వామి వారు నరసింహ అవతారం లో దర్శనమిస్తున్నారు. ఈ అవతారం లో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనుర్మాస ఉత్సవాలు సందర్భంగా రెండు వందల పాశురాలను అధ్యయనం చేశారు. మధ్యాహ్నం మహా రాజ భోగం అనంతరం స్వామి వారు చిత్రకూట మండపంలో వేంచేసి ఉన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. పూర్వకాలంలో ప్రహల్లాదున్ని హిర్ణయాక్షుడు అంతం చేయాలనీ ప్రయత్నించిగా విష్ణు మూర్తి నరసింహ అవతారం ఎత్తారు అని పురాణాలు చెప్తున్నట్లు ఆలయ వేదపండితులు తెలిపారు. విష్ణుమూర్తి నరసింహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుని సంహరించినట్లు తెలిపారు ఈ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యాక్షుడు రాక్షసుని సంహరించినట్లు వేద పండితులు తెలుపుతున్నారు ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల భూత బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు..
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్