నూతనవ్యవసాయచట్టాలు,విద్యుత్ సవరణ చట్టంలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు 26 వ రోజు సంఘీభావంగా చీమకుర్తి పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది.రైతుసంఘం మండల కార్యదర్శి కిస్తిపాటి కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో రైతు సంఘం జిల్లాకార్యదర్శి పమిడి వెంకటరావు మాట్లాడుతూ దేశ ప్రజలకు హానికరమైన ఈ చట్టాలు చర్చకు రాకుండా కరోనా పేరుతో పార్లమెంటును వాయిదా వేశారన్నారు.బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారానికి కరోనా అడ్డురావడంలేదని బీజేపీ కపట నాటకాన్ని అర్ధం చేసుకోవాలి అన్నారు.సీఐటీయు జిల్లానాయకుడు పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ రాజ్యాంగవిరుద్ధమైన ఈ నల్ల చట్టాలను రద్దు చేసేవరకు రైతుల పోరాటానికి అండగా ఉంటామన్నారు.రైతుసంఘం నాయకులు కొల్లూరి వెంకటేశ్వర్లు,బెజవాడ శ్రీను,కుమ్మిత శ్రీను,సీఐటీయు నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు,ఇట్టా నాగయ్య,అల్లడి కొటేశ్వరవు,అత్యాల యోహాను,వ్యవసాయ కార్మికసంఘం నాయకుడు కంకణాల వెంకటేశ్వర్లు, తొట్టెంపూడి రామారావు,రచయితల సంఘం నాయకుడు పిన్నిక శ్రీను తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి ఎన్ ప్రసాద రావు.