- కేసీఆర్ అంటేనే మోసం, దగా
- కల్వకుంట్ల కుటుంబం ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం
- రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ మేలుకుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే మోసం, దగా అని మధు యాష్కీ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబమని దుయ్యబట్టారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పారని అన్నారు. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగిన ఎమ్మెల్యేకు బంగ్లాలు, వజ్రవైఢూర్యాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి రూ. 884 కోట్ల ఫండ్ ఎలా వచ్చిందని అడిగారు. రాహుల్ పర్యటన తర్వాత తెలంగాణ మేలుకుందని, రాష్ట్ర ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పారు.