Header Top logo

ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

అఖిల భారత విద్యార్థి సమైక్య ఏ ఐ ఎస్ ఎఫ్( AISF )

స్థానిక వెల్దుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని AISF డిమాండ్
వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ పాత బస్టాండ్ లో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, డి, సోమన్న రాష్ట్ర సమితి సభ్యులు, టి, కృష్ణ మాట్లాడుతూ వెల్దుర్తి మండలం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీ చదువుకోవడానికి వెల్దుర్తి లో డిగ్రీ కళాశాల లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని తెలిపారు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పత్తికొండ శాసనసభ్యులు KE కృష్ణ మూర్తి గారికి వినతి పత్రం అందించిన పరిష్కారం లేక వెల్దుర్తి మండల విద్యార్థులు చదువు మధ్యలో మాను వేయడంపై AISF ఖండిస్తున్నామని తెలిపారు
మరియు క్రిష్ణగిరి మండలాల నుంచి వెల్దుర్తి నుంచి డోన్ కి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి మేడం గారు తక్షణమే వెల్దుర్తి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు వెల్దుర్తి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూకి చర్యలు తీసుకోవాలని తెలిపారు లేనిపక్షంలో ఉద్యమాల బట్ట పడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డి సోమన్న రాష్ట్ర సమితి సభ్యులు టి కృష్ణ, మాజీ ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు M. హరి కృష్ణ, మండల అధ్యక్ష కార్యదర్శులు, మొహమ్మద్ రఫీ, అడవి రాముడు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking