సీతానగరం: జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వారిచే నియమింపబడిన పర్యావరణ సంయుక్త ఇంజనీర్ వారి బృందం బుధవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం లో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించింది. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని పరిశీలనకు రావడం జరిగిందని బృందం తెలిపింది. బృందం ఎత్తిపోతల పథకం పర్యావరణ పరంగా డెలివరీ సిస్టం పథకానికి సంబంధించిన మోటార్లు పనితీరు తదితర అంశాలను నిశితంగా పరిశీలించింది. అనంతరం ఈ బృందం దేవీపట్నం మండలం నేలకోట వద్ద ఎత్తిపోతల పథకం పైప్లైన్ ద్వారా డెలివరీ కాపాడుతున్న ప్రాంతాన్ని వారు సందర్శించి పర్యావరణ స్థితిగతులను పరిశీలించారు. బృందాన్ని స్థానిక రైతులు కలుసుకుని గతంలో తమ భూములకు నష్టపరిహారాన్ని అందించలేదని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించమని బృంద సభ్యులకు తెలుపగా ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తాము చేసేదేమీ లేదని రైతులకు తప్పని సరిగా న్యాయం జరుగుతుందని సంయుక్త ఇంజనీర్ పి రాజేంద్ర రెడ్డి రైతులకు తెలిపారు. ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆయన రైతులకు సూచించారు. కమిటీ సభ్యుల లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరు జగన్నాథ్ రావు, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వారు సభ్యులుగా ఉన్నారని వారికి బదులుగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిష హాజరయ్యారు. ఈ పర్యటనలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ యాదవ్, కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్, ప్రాజెక్ట్ మేనేజర్ మురళి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మల్లికార్జున రావు, తాసిల్దార్ శివమ్మ, వ్యవసాయ అధికారి సూర్య రమేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె రమేష్ తదితరులు బృందం వెంట ఉన్నారు.