శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని లేకపోతే ఢిల్లీ అమరవీరుల స్ఫూర్తి తో పోరాటాలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు హెచ్చరించారు.ఆదివారం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిరంకుశ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని గత 24రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న పోరాటంలో మృతి చెందిన 33మంది రైతులకు రణస్థలం మండల కేంద్రం, కృష్ణాపురం గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న మోడీ ప్రభుత్వం 3రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.