Header Top logo

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం

కంభం మండలంలోని కందులపురం సెంటర్లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కంభం డిప్యూటీ ఎమ్మార్వో ప్రసాద్ గారు వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపిటిసి కటిక భాస్కర్ పూలమాలలు వేసి జోహార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేయడం చేయడం జరిగింది.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కల్వకురి అబ్రహం ఆధ్వర్యములో నిరుపేద లకు చీరలు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అబ్రహం మాట్లాడుతూ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన గొప్ప కార్యాలను త్యాగాలను ప్రజలకు మరొకసారి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కంభం మండల డిప్యూటీ ఎమ్మార్వో ప్రసాద్, వైయస్ఆర్సీపీ మాజీ ఎంపీటీసీ కటికల భాస్కర్ , డివిజన్ మాల మహానాడు అధ్యక్షులు శ్రీ రాం పెద్దక్క, మాల మహానాడు గిద్దలూరు అధ్యక్షులు శ్రీనివాసులు, కంభం మండలం అధ్యక్షులు బిళ్ళ తిరుపాల్, ఎర్రగొండపాలెం అధ్యక్షులు తల పాటి రమేష్, మహిళలు మాల మహానాడు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking