కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఈరోజు గుట్కా ప్యాకెట్ల పట్టివేత ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుట్కా ప్యాకెట్ల విక్రయాన్ని రాష్ట్రంలో నిషేధించినప్పటికీ కొంతమంది వర్తకులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తూ అక్రమార్జనకు తెర తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే మంత్రాలయం నియోజకవర్గ కేంద్రం మంత్రాలయంలో రామచంద్ర నగర్ లోని కిరణా వర్తకుడు లక్ష్మీనారాయణ శెట్టి ఇంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో సోదాలు జరపగా అక్రమంగా నిలువ ఉంచిన రూ.31, 364/- విలువచేసే గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. ఈ సందర్భంగా సి.ఐ కృష్ణయ్య మాట్లాడుతూ వర్తకునిపై కేసు నమోదు చేశామని పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం లో గుట్కా, సిగరెట్,మద్యం ఎట్టి పరిస్థితుల్లో విక్రయించడానికి అనుమతి లేదని, ఆలయ పవిత్రతను కాపాడడానికి ఎప్పటికప్పుడు అక్రమ వర్తకులపై తనిఖీ చేస్తామని చెప్పారు. కర్నూలు జిల్లామంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ :-V. నరసింహులు.