- నెలకు కొంత చెల్లిస్తే చాలు
- ఏటేటా కొత్త ఐఫోన్ కు మారిపోవచ్చు
- ఐప్యాడ్, ఇతర ఉత్పత్తులకూ ఈ విధానం
- ఈ ఏడాది చివర్లోగా ప్రారంభించే అవకాశం
ఇప్పటి వరకు సబ్ స్క్రిప్షన్ సేవలు యాపిల్ మ్యూజిక్, ఐ క్లౌడ్, యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ ఫిట్ నెస్ ప్లస్, యాపిల్ ఆర్కేడ్ వంటి సాఫ్ట్ వేర్ సర్వీసులకే అమల్లో ఉన్నాయి. ఒక ఐఫోన్ ధరను 12 నుంచి 24 నెలలకు వసూలు చేసే మాదిరిగా ఈ సబ్ స్క్రిప్షన్ విధానం ఉండదని బ్లూంబర్గ్ పేర్కొంది. ఏటా విడుదల చేసే కొత్త ఐఫోన్ సిరీస్ కు మారిపోవచ్చు. పాత డివైజ్ తీసుకుని కొత్త మోడల్ డివైజ్ ను యాపిల్ అందిస్తుంది. నెలవారీగా కస్టమర్ ఎంత చెల్లించాలన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. ఈ సేవను యాపిల్ ఆవిష్కరిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.