Header Top logo

ఏపీలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారంటే.. జిల్లాల వారీగా వివరాలు ఇవిగో!

  • మొత్తం నిరుద్యోగుల సంఖ్య 6,16,689
  • మహిళా నిరుద్యోగుల సంఖ్య 1,94,634
  • పురుష నిరుద్యోగుల సంఖ్య 4,22,055
ఆంధ్రప్రదేశ్ లో 6,16,689 మంది నిరుద్యోగులు ఉన్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 1,94,634 మంది మహిళలు ఉండగా… 4,22,055 మంది పురుషులు ఉన్నారు. టీడీపీ సభ్యులు ఏలూరి సాంబశివరావు, బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజులు శాసనసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 
రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో నిరుద్యోగులు ఉన్నారు. కర్నూలు జిల్లాలో 64,294 మంది, కడప జిల్లాలో 58,837 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 18,730 మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే వీరందరూ ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారు మాత్రమే కావడం గమనార్హం.

జిల్లాల వారీగా ఆ వివరాలు: 
నిరుద్యోగుల వివరాలు
జిల్లా పురుషులు మహిళలు మొత్తం
విశాఖపట్నం
68,409
30,095
98,504
కర్నూలు
50,639
13,655
64,294
కడప
40,427
18,410
58,837
పశ్చిమగోదావరి
37,365
18,300
55,665
తూర్పుగోదావరి
32,640
15,867
48,507
నెల్లూరు
30,932
13,829
44,761
చిత్తూరు
27,023
16,616
43,639
విజయనగరం
28,482
13,813
42,296
కృష్ణా
25,882
14,059
39,941
ప్రకాశం
27,142
10,315
37,457
గుంటూరు
20,873
11,611
32,484
శ్రీకాకుళం
20,771
10,803
31,574
అనంతపురం
11,469
7,261
18,730
మొత్తం
4,22,055
1,94,634
6,16,689

Leave A Reply

Your email address will not be published.

Breaking