ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం లోని మేడిపల్లి, నాచారం, గంగుల కాలనీ కి సంబందించిన పోడు రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టా హక్కులు కల్పించాలని, 2015 లో గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు, 2017లో ఐటీడీఏ భద్రాచలం ఆర్డర్ మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం పోడు భూములపై జాయింట్ సర్వే నిర్వహించాలని, పేదలకు పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయకుండా ఆ గ్రామాలకు చెందిన ఒక ఐదుగురు పొలాల్లో ఫారెస్ట్ అధికారులు మొక్కల వేశారని, దీనిమీద పూర్తి విచారణ చేసి, కోర్టు ధిక్కరణ కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిల్లీలో నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ కి భారత మానవ హక్కుల మండలి తరపున మెమొరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ అందిందిని ఏన్కూరు మండల ఎమ్మార్వో గారు తెలిపారు. పేదలకు న్యాయం జరిగే వరకు భారత మానవ హక్కుల మండలి ఎప్పుడు అండగా ఉంటుంది అని ఈ సందర్బంగా తెలియజేస్తూ, ఎమ్మార్వో గారికి ప్రజా సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో HRCI రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాస్, HRCI సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇనపనూరి నవీన్, పల్లగాని తేజ, పల్లగాని శ్రీనివాసరావు, స్థానికంగా ఉన్న గిరిజనులు సుమారు 200 మంది పాల్గొన్నారు.
ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్