కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం స్థానిక మండల ఆటో స్టాండ్ నందు మండల ఎస్సై జి పి నాయుడు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఈ సమావేశం నందు ఆటో డ్రైవర్లు ఎవరైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన ఎడల వారి పైన చట్టరీత్యా చర్య తీసుకొనబడును. అంతేకాకుండా ఎక్కువ మంది ప్రయాణికులతో ప్రయాణం చేసిన ఎడల వారి లైసెన్సులు రద్దు చేసి భారీగా జరిమానా విధించబడును అని హెచ్చరించారు. ఈ సమావేశం నందు మండల ఎస్సై జి పి నాయుడు మరియు పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రజా నేత్ర మౌలాలి ..