Header Top logo

ఎటపాక ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎటపాక : ఎటపాక మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం ఎటపాక మండలంలో జరిగింది. ఈ కమిటీ ఎన్నికకు గౌరవ అధ్యక్షులుగా అగ్నిపర్తి.వెంకట్ (పెన్ పవర్ రిపోర్టర్) వ్యవహరించగా , ఎటపాక ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా పి.మోహనరావు (విశాలాంధ్ర దినపత్రిక) , ప్రధాన కార్యదర్శిగా ఏ.రామ్ (విశ్వం వాయిస్ దినపత్రిక) , కోశాధికారిగా వై.రాంబాబు (సూర్య దినపత్రిక) , ఉపాధ్యక్షులుగా గూడపాటి.రవికుమార్ (జనసేన దినపత్రిక) , న్యాయ సలహాదారుగా తిరువీధుల.మల్లికార్జున్ (సాత్వి దినపత్రిక) , గౌరవ సలహాదారులుగా ఎస్కే.షబ్బీర్ (ఆంధ్రజ్యోతి దినపత్రిక) , కె.వెంకట్ (ఉదయ అక్షరం దినపత్రిక) , బి.ఆనంద్ (పవర్ దినపత్రిక) , సహాయ కార్యదర్శిగా తూము.రాజేష్ (ఇండస్ విజన్ దినపత్రిక) , ప్రచార కార్యదర్శిగా గుంటుపల్లి.సాయికుమార్ (వి.ఎస్.బి న్యూస్) కమిటీ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు. కావున ఎన్నిక కాబడిన నూతన కమిటీ సభ్యులకు మండల అధికారులు , రాజకీయ నాయకులు అభినందనలు తెలియజేశారు.

గమనిక :- మండల అధికారులకు , నాయకులకు , ప్రజానీకానికి విన్నపం. మండలంలో జరిగే ఏదైనా అధికారిక , అనధికారిక కార్యక్రమాలు , ప్రెస్ మీట్లకు సంభందించిన ముందస్తు సమాచారం 2 గంటల ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష లేదా కార్యదర్శికి 8919462276 / 8247616956 మొబైల్ నంబర్లకు తెలుపగలరని కోరుతున్నాము. ధన్యవాదాలు

ప్రజా నేత్ర రిపోర్టర్  జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking