కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు జి. భీమరెడ్డి అన్నారు. రాంపురం రెడ్డి సోదరుల ఆదేశాల మేరకు గురువారం మండల పరిధిలోని 52 బసాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు పొందిన లబ్దిదారులతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అర్హత ఉండి పథకాలు రాని వారికి ఎందుకు రాలేదని మరలా ఆన్ లైన్ లో నమోదు చేసి వచ్చే విధంగా వాలంటరీలు చూడాలని కోరారు. అంతే కాకుండా నియోజకవర్గ శాసన సభ్యులు వై. బాలనాగిరెడ్డి గారు 52 బసాపురం గ్రామానికి ఎత్తిపోతల పథకం కుడా మంజూరు చేయించారని దీంతో రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటి కి ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. అనంతరం పలు కాలనీల్లో పర్యటిస్తు ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీ లను అమలు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు 52బసాపురం నుంచి దిబ్బనదొడ్డి గ్రామానికి వెళ్లే రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కి నిధులు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే కు దక్కుతుందన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు వాలంటరీ లు తమకు కేటాయించిన ఇళ్ల దగ్గరికి వెళ్లి సంక్షేమ పథకాలు అందినయా లేదా అని అడిగి కారణం వివరించి మరలా దరఖాస్తు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా మంత్రాలయం ప్రజా నేత్ర రిపోర్టర్ :-V నరసింహులు