Header Top logo

𝗦𝗨𝗖𝗖𝗘𝗦𝗦𝗙𝗨𝗟 𝗦𝘁𝗼𝗿𝘆 ఐపీస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ

𝗜𝗻𝘀𝗽𝗶𝗿𝗮𝘁𝗶𝗼𝗻 & 𝗦𝗨𝗖𝗖𝗘𝗦𝗦𝗙𝗨𝗟 𝗦𝘁𝗼𝗿𝘆
ఐపీస్ ఆఫీసర్ సక్సెస్ స్టోరీ

22 ఏళ్ళ అతి పిన్న వయసులో ఐపీస్(IPS) సాధించిన స‌ఫిన్ హ‌స‌న్‌..

పేదరికం అడ్డుపడినా.. వేధించినా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సులో ఐపీఎస్ కొట్టి రికార్ట్ క్రియేట్ చేశాడు ఈ నిరుపేద యువ‌కుడు.కొంద‌రు పుట్టుక‌తోనే ధ‌న‌వంతులుగా ఉంటారు. వీరి జీవితం సాఫీగా సాగుతుంది. కానీ కొంద‌రు పేదరికంలో జ‌న్మించి..ఉన్న‌త శిఖ‌రాల‌ను సాధించాలంటే అహోరాత్రులు శ్ర‌మించక త‌ప్ప‌దు. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని న‌మ్మాడు క‌నుక‌నే అత‌ను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లిగాడు. పేదరికం అడ్డుపడి.. వేధించిన‌ త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకునేందుకు అది ఏ మాత్రం అడ్డు కాలేదు ఈ యువ ఐపీఎల్ అధికారి స‌ఫిన్ హ‌స‌న్‌కి.

రాత్రింబ‌వ‌ళ్లు..

దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్సులో ఐపీఎస్ అయిన వ్య‌క్తిగా గుర్తింపు పొందాడు. 22 ఏళ్ల వ‌య‌స్సులోనే యూపీఎస్‌సీ సివిల్ స‌ర్వీస్ పరీక్ష‌లు రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యాడు. ఆ ప‌రీక్ష ఎంత క‌ఠినంగా ఉంటుందో అంద‌రికీ తెలుసు. అయిన‌ప్ప‌టికీ రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐపీఎస్ అయ్యాడు. సివిల్ స‌ర్వీస్ ఎగ్జామ్‌లు రాసేవారు చాలా మంది ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు కంటుంటారు. కానీ హ‌స‌న్ మాత్రం ఐపీఎస్‌ను ఎంపిక చేసుకున్నాడు. ప్ర‌జ‌ల‌కు ఐపీఎస్ అయి సేవ చేయాల‌న్న‌ది అత‌ని ముఖ్య‌ ఉద్దేశం. అందుక‌నే ఐపీఎస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు… సాధించాడు.

త‌న_ల‌క్ష్యాన్ని..

2018లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఆలిండియా స్థాయిలో 570 ర్యాంకును సాధించాడు. తర్వాత‌ ఐపీఎస్ అయ్యి 2019 డిసెంబ‌ర్ 23న జామ్‌న‌గ‌ర్ జిల్లా అసిస్టెంట్ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాడు.

కుటుంబ నేప‌థ్యం

హ‌స‌న్ ది చాలా నిరుపేద కుటుంబం. హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంబా. గుజ‌రాత్‌లోని క‌నోద‌ర్ అనే ఓ చిన్న పల్లెటూరు వీరిది. వీరికి పూట పూట‌కు స‌రిగ్గా భోజ‌న‌మే దొరికేది కాదు. కొన్ని సార్లు రాత్రి పూట ఆక‌లితోనే నిద్ర‌పోవాల్సి వ‌చ్చేద‌ని హ‌స‌న్ తెలిపాడు. అత‌ని త‌ల్లిదండ్రులు వ‌జ్రాల గ‌నుల్లో కార్మికులుగా ప‌నిచేసేవారు.

చదువు కోసం..

హసన్ తన చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వ‌చ్చే కొద్దిపాటి ఆదాయం అతని చదువుకు సరిపోయ్యేది కాదు. తమ కుమారుడి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి, అదనపు డబ్బు సంపాదించడానికి వారు స్థానిక రెస్టారెంట్లలో పని చేసారు. అత‌ని త‌ల్లి పార్టీలు, పెళ్లిళ్ల‌లో రోటీల‌ను త‌యారు చేసి డ‌బ్బులు సంపాదించేది. ఆ విధంగా హ‌స‌న్ క‌ష్ట‌పడి చదివి ఒక్కో మెట్టుకు ఎదుగుతూ నేడు ఈ స్థానానికి చేరుకున్నాడు.

నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన హాసన్.. తన హోదా చూసి పొంగిపోకుండా తన అధికారంతో సమాజంలో మంచి ఉన్నత విలువలు నెలకొల్పాలని ఆశిస్తూ మన నందనవనం గ్రూప్ నుండి #హాసన్_ఐపీస్ గారికి అభినందనలు.

– Umar farooq khan face book

Leave A Reply

Your email address will not be published.

Breaking