Header Top logo

షాద్‌నగరుకు శని పట్టింది..! కాంగ్రేస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్

షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు తెరాస ప్రభుత్వ రూపంలో ఒక శని పట్టిందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దివాళా తీసి రాష్ట్ర వ్యాప్తంగా
అభివృద్ధి కుంటు పడిందని కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అధికార పార్టీ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగుడా మండలాన్ని స్థానిక నేతలతో కలిసి ఆయన పర్యటించారు. మండల పరిధిలోని ఆయా గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారిన దుస్థితిపై మీడియాకు వీర్లపల్లి శంకర్ వివరించారు. జిల్లేడు నుండి వీరన్నపేటకు సంబంధించి రహదారి పనులకు శంకుస్థాపన చేసి రెండేళ్లు గడిచిపోయాయని విమర్శించారు. అంతేకాదు రహదారిపై గాయపడ్డ ఎర్రగడ్డ సైదమ్మ, గార్గుల ఎల్లయ్య, కావలి నరేష్, ఎం.డి సలీం, వెంకటయ్య, శేఖర్ అనే వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారనీ దీనికి తెరాస పాలకులు బాధ్యత వహించాలనీ
డిమాండ్ చేశారు. మండలంలో ఏ గ్రామానికి వెళ్లాల్సిన రహదారి చూసిన గుంతల మయంగా మారింది అని టిఆర్ఎస్ పాలకులు అనేక రోడ్ల కు హామీలు ఇచ్చి వాటిని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని ప్రభుత్వం అంటోందని మరి బంగారు తెలంగాణ అంటే ఇదేనని వీర్లపల్లి శంకర్ ప్రశ్నించారు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న ఉద్యమకారులు, కళాకారులు, మేధావులను నేడు ప్రభుత్వం, పాలకులు వారిని పక్కన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుటుంబం అదేవిధంగా నియోజకవర్గాల్లో పాలకులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగు పడుతున్నారని ఆరోపించారు. పాలకుల సొంత అభివృద్ధి, వారి కుటుంబ సభ్యుల అభివృద్ధి మాత్రమే అవుతుందని తీవ్ర విమర్శలు చేశారు. కొంతమంది మండలాల వారీగా అధికారాన్ని పంచుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. షాద్ నగర్ ముఖద్వారమైన కొత్తూరు నుండి అన్నారం జంక్షన్ వరకు ఏర్పడ్డ రోడ్డు దుస్థితిపై పర్యటించామని అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే అధికార పార్టీ దానిని జీర్ణించుకోలేక ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటని అన్నారు. ప్రతిపక్షాల నోళ్లు మూయాలి అంటే ముందు అభివృద్ధి చేసి చూపించాలని, అలా కాకుండా ప్రతిపక్షాలు మాట్లాడితే నోరు మూసుకొని చెబుతుండడం తెరాస పార్టీ నాయకులు సిగ్గుపడాలని విమర్శించారు.
నియోజకవర్గంలో తండాల గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వాటికి సరైన నిధులు విధులు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని విమర్శించారు. నిధులు లేని పరిపాలన ఎలా సాధ్యమవుతుందని, ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించిన భవనాలు కనీస సిబ్బంది కూడా కరువయ్యారని విమర్శించారు. కానీ రాష్ట్ర స్థాయిలో పాలకుల అవినీతి పెరిగిపోయిందని వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని, గ్రామాల అభివృద్ధి జరగడం లేదని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన విధంగా ప్రజలు, ప్రతిపక్షాలు స్పందిస్తారని కాంగ్రేస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మహేష్ రంగా రెడ్డి జిల్లా. చౌదర్ గూడెం.

Leave A Reply

Your email address will not be published.

Breaking