Header Top logo

బ్రహ్మాణపల్లిలో ఐ కే పీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎంపీపీ బి.రాణిబాయి రామారావు.

మహాదేవపురం మండలం బ్రాహ్మణ పల్లి గ్రామములో ఐ కే పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎంపీపీ బి.రాణిబాయి రామారావు రిబ్బేన్ కట్ చేసి ప్రారంభించారు. రైతులు రేయింబవళ్లు కష్ట పడి పండించిన పంట లకు గిట్టుబాటు ధర కలిపించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎంపీపీ రాణిబాయి రామారావు అన్నారు. ఐ కే పీ సిబ్బంది, గ్రామైఖ్య సంగం మహిళలు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని, తరిగు పేరుతో రైతుల వద్ద అధిక మొత్తంలో కోత లు పెట్టవద్దని సూచించారు.. బార్దాన్, రవాణ, చెల్లింపుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అన్నారు. అవకతవకలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వ సమితి అధ్యక్షుడు బండము లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ అరుణ శ్రీనివాస్, సర్పంచ్ అశోక్ రావు, ఐ కే పీ సీ సీ నిర్మల, వివో అధ్యక్ష కార్యదర్శులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking