సారవకోట మండలం మన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులు బాధలు చూడలేక ఎంతో ప్రతిష్టత్మాకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు ఈ సంవత్సరం కూడా నామమాత్రం గానే మిగిలాయి చాలామంది రైతులు తుఫాన్ కారణం గా తొందరగా కొయ్యడం జరిగింది అయితే మన రైతు భరోసా కేంద్రాలలో ఇంకా రిజిస్ట్రేషన్ లే తప్ప ధాన్యము కొనడము ప్రారంభించలేదు అందువల్ల మళ్ళీ వర్షాలు పడితే చేతి కి అందిన పంట ఎక్కడిపోతుందో అని బయపడి మళ్ళీ ఈ సీజన్ లో కూడా దళారులు కు అమ్మటం జరిగింది. ప్రభుత్వం మద్దత్తు ధర 1490/- ప్రకటించగా దళారులు 1330/- కు రైతులదగ్గర కొంటున్నారు అంటే ఒక రైతు సుమారు ఒకబస్తా కి 160/- నష్టపోతున్నారు మనమండలం లో సుమారు 60% రైతులు తమ ధాన్యన్ని అమ్మేయటం జరిగింది కనీసం మిగతా రైతులను అయినా ఆడుకోవాలని రైతులు కోరుకుంటున్నారు సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ధాన్యము కొనుగోలు చేయవలసిందిగా కోరుచున్నాము..ప్రజా నేత్ర న్యూస్ :మురళీ కృష్ణ సారవకోట మండలం..