కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు సాధన కోసం జిల్లా వ్యాప్తంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యం లో ప్రజల మద్దతు కోసం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సొంటి పులి శేఖర్ సీపీఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టీ. కృష్ణ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా నుండి మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి అయినా జిల్లా ఏమాత్రం అభివృద్ధి చందా లేదన్నారు తక్షణమే జిల్లాలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువత కు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని ఆయన అన్నారు అదేవిధంగా జిల్లాలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వేదవతి గుండ్రేవుల సిద్దేశ్వరం ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలి కర్నూల్ లో హైకోర్టు ప్రక్రియ ప్రారంభించాలి రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికై అధిక నిధులు అదనపు కోర్సులు అదేవిధంగా ఆదోని కోడుమూరు ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కి దామోదరం సంజీవయ్య గారి పేరు నామకరణం చేయాలి డోను పత్తికొండ ఆలూరు నియోజకవర్గం లో వేసవికాలంలో త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని డిమాండ్ తో సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి మద్దతు గా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి టి.కృష్ణ. ఏఐవైఎఫ్ నాయకులు రంగస్వామి. అడవి రాముడు. మనోహర్. మహమ్మద్ రఫీ. భాష. పరశురాముడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.