కొండపాక మండలం:బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కొండపాక మండల తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి మండల మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌరారం కృష్ణ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విషయం తెలుసుకున్న కుకునూరుపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు అనంతరం సన్న వడ్ల కు మద్దతు ధర క్వింటాల్కు 2500 కల్పించాలని ఎమ్మార్వో కార్యాలయంలో లేఖ ఇవ్వడం జరిగింది అనంతరం మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు గౌరారం కృష్ణ, భాజపా నాయకులు సిరిసనగండ్ల ఎంపిటిసి నందాల శ్రీనివాస్, మండలాధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఆదేశాల మేరకు రైతులు సాగుచేసినారు కావున అట్టి వడ్లను క్వింటాలుకు 2500 ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాలి, లక్ష రూపాయల రుణమాఫీ ని వెంటనే అమలు పరచాలి, ప్రతి సంవత్సరం ఖరీఫ్- రబీ ల కొరకు రైతు బంధు సహాయం విడుదల తేదీలను ముందుగానే ప్రకటించాలి, కేంద్ర ప్రభుత్వం వివిధ( యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం) వ్యవసాయ పథకాలకు ఇస్తున్న సబ్సిడీని వెంటనే అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. నిజంగా రైతుల మీద ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే వీటిని వెంటనే అమలు చేయాలి అని డిమాండు చేశారు.ఇట్టి కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి గడ్డమీది రామస్వామి, మండల ఓబిసీ మోర్చా అధ్యక్షులు పోచ మైన స్వామి, సీనియర్ నాయకులు ఆరేపల్లి లింగం గౌడ్ ,దాసరి భానుచందర్ ,ఆరేపల్లి నాగ చరణ్, కిషన్ ,రామకృష్ణ, సంజయ్ తదితరులు పాల్గొన్నారు..కొండపాక రిపోర్టర్, తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్.