ప్రకాశంజిల్లా సంతనూతలపాడు మండలం బి. మద్దులూరు గ్రామానికి వీఆర్వోగా పనిచేస్తున్న పూండ్ల శ్రీహరిబాబు అదే గ్రామానికి చెందిన నన్నూరి మధుసూదనరావుకి చెందిన భూములను ఆన్లైన్లో సరిచేయడానికి మొత్తం లక్షన్నర రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దీంతో నన్నూరి మధుసూదనరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. దీంతో ఈరోజు ఉదయం నన్నూరి మధుసూదనరావు వీఆర్వో శ్రీహరిబాబుకి లక్ష రూపాయలు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ దొరికిపోవడం జరిగింది. దీంతో వీఆర్వో శ్రీహరిబాబు వద్దనున్న లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.