- ప్రాణ నష్టం బాధించింది
- మృతుల కుటుంబాలకు నా సానుభూతి
- గాయపడ్డారు త్వరగా కోలుకోవాలి
- ట్వీట్ చేసిన ప్రధాని కార్యాలయం
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం లో ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో 13 మంది తీవ్రంగా గాయపడడం తెలిసిందే. యూనిట్ 4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలిపోవడం అగ్ని ప్రమాదారికి దారితీసినట్టు భావిస్తున్నారు.
‘‘ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు కెమికల్ యూనిట్ లో ప్రమాదం కారణంగా ప్రాణనష్టం జరగడం బాధించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’అంటూ ప్రధాని తరఫున ఆయన కార్యాలయం ట్వీట్ చేసింది.