Header Top logo

ఎక్కడికెళ్లకుండానే బెంగళూరు డాక్టర్ కు ఒమిక్రాన్..

దేశంలో రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు 66 ఏళ్ల విదేశీయుడు కాగా.. మరొకరు 46 ఏళ్ల బెంగళూరు వైద్యుడు. ఇద్దరూ దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారేనని నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) రికార్డుల ప్రకారం ఓ షాకింగ్ విషయం తెలిసిందే.

ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఆ డాక్టర్ కు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని బీబీఎంపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎక్కడికెళ్లకుండానే ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. గత నెల 21న డాక్టర్ కు జ్వరం, ఒళ్లు నొప్పులున్నాయని, మరుసటి రోజు ఆర్టీపీసీఆర్ టెస్టులో అతడికి పాజిటివ్ వచ్చిందని బీబీఎంపీ రికార్డుల్లో పేర్కొన్నారు.

శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపిస్తే.. 24వ తేదీన ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. మూడు రోజుల చికిత్స తర్వాత అదే నెల 27న అతడిని డిశ్చార్జి చేశారు. కాగా, మరో వ్యక్తికీ ఒమిక్రాన్ వచ్చినా.. అతడు దుబాయ్ కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు కేసుల్లో ఒకదానికొకటి ఎలాంటి సంబంధం లేదని బీబీఎంపీ రికార్డుల్లో పేర్కొంది.
Tags: COVID19, Omicron, Bengaluru, Karnataka, South Africa

Leave A Reply

Your email address will not be published.

Breaking